Asianet News TeluguAsianet News Telugu

సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...

సమత గ్యాంగ్ రేప్ కేసులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. 

Hyderabad: Police files charges in Samatha rape-murder
Author
Hyderabad, First Published Dec 15, 2019, 8:56 AM IST

ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమతపై గ్యాంగ్‌రేప్, హత్య చేసిన ఘటనపై చార్జీషీట్‌లో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. ఈ కేసులో 44 మంది సాక్షులను పోలీసులు విచారించి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులకు శిక్ష పడేందుకుగాను శాస్త్రీయ ఆధారాలను కూడ పోలీసులు సేకరించారు.

గత నెల 24వ తేదీన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కుమరంభీమ్ జిల్లా రామ్ నాయక్ తండా సమీపంలో ముగ్గురు నిందితులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేశారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత సమత హత్య కేసు నిందితులను కూడ కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మొదలైంది. ఆందోళనలు కూడ కొనసాగాయి.దీంతో పోలీసులు కూడ ఈ కేసు విషయమై చర్యలు చేపట్టారు.

సమతపై గ్యాంగ్‌రేప్, హత్య కేసులో 44 మంది సాక్షులను విచారించి పోలీసులు చార్జీషీట్ ను శనివారం నాడు దాఖలు చేశారు. 96 పేజీలతో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చశారు. శాస్త్రీయ ఆధారాలను కూడ చార్జీషీట్ లో పొందుపర్చారు.

96 పేజీల చార్జీషీట్‌లో 13 పేజీల్లో ఛార్జీషీట్. మిగిలిన పేజీల్లో సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ నివేదికతో పాటు పంచనామా వివరాలు ఉన్నాయి.

ఛార్జీషీట్‌తో పాటు ముగ్గురు నిందితులు ఘటన జరిగిన రోజున వేసుకొన్న దుస్తులను, కత్తి, మృతురాలి సెల్‌ఫోన్, రెండువందల రూపాయాలను కూడ పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు.

నిందితుల దుస్తులపై ఉన్న రక్తం మరకలు, బాధితురాలు ధరించిన చీరతో పాటు నిందితుల లో దుస్తులకు అంటిన వీర్యకణాల్ని ధృవీకరించే ఫోరెన్సిక్ నివేదికను కూడ పోలీసులు ఛార్జీషీట్‌లో పొందుపర్చారు. 

also read:సమత రేప్, హత్య కేసులో చార్జిషీట్: చీరపై స్పెర్మ్ ఆధారంగా నిందితుల గుర్తింపు

ఘటన స్థలంలో మృతురాలి చీరపై ఉన్న వీర్యకణాలు, నిందితుల రక్త నమూనాలతో సరిపోల్చే డిఎన్ఏ నివేదికలను కూడ పోలీసులు ఛార్జీషీట్‌తో జతపర్చారు.

సమతపై 30 ఏళ్ల షేక్ బాబు తొలుత అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలు రామ్‌నాయక్ తండా వద్దకు చేరుకోగానే రోడ్డు పక్కకు నెట్టేసి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించింది. ఆ తర్వాత ఆమెను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో మిగిలిన  ఇద్దరు నిందితులు అతనికి సహకరించారు.

బాధితురాలి కాళ్లు, చేతులు కదలకుండా ఇద్దరు నిందితులు పట్టుకొన్నారు. ఆ తర్వాత మిగిలిన ఇద్దరూ కూడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని బాధితురాలు బయటకు చెబుతోందోమోనని భయపడ్డారు. 

దీంతో ఆమెను చంపాలని నిర్ణయానికి వచ్చారు. ఆమెను చంపితే విషయం బయటకు రాదని భావించారు. షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్ ఆమె చేతులు,  కాళ్లను పట్టుకొన్నారు. షేక్ బాబు తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేశారు. 

షాబుద్దీన్ మృతురాలి సెల్‌ఫోన్ తీసుకొన్నారు. ఆమె వద్ద ఉన్న రెండు వందల రూపాయాలను కూడ తీసుకొని పారిపోయారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios