కరీంనగర్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దిశలాంటి సంఘటనలో ఎన్ కౌంటర్లు పరిష్కారం కాదని ఈటల అభిప్రాయపడ్డారు. 

దిశలాంటి సంఘటనలో ఉరిశిక్షలు కూడా సమస్యకు పరిష్కారం కాదని చెప్పుకొచ్చారు. అవి తాత్కాలిక పరిష్కారాలేనని అభిప్రాయపడ్డారు. సమాజంలో మార్పు రావాలని మంత్రి ఈటల ఆకాంక్షించారు. 

లోకకళ్యాణం కోసం ఉపయోగపడాల్సిన సెల్‌ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మానవ జీవితాన్ని విధ్వంసం చేస్తున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తుపై భయమేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బయటకు వెళ్తే క్షేమంగా వస్తారన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కంచే చేను మేసినట్లు పిల్లలపై తండ్రులే క్రూరంగా వ్యవహరిస్తున్న ఘటనలు చూస్తుంటే ఆందోళక కలుగుతుందంటూ ఈటల అభిప్రాయపడ్డారు. డా.బి.ఆర్ అంబేద్కర్, మహాత్మగాంధీజి కలలు నెరవేరాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు. 

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్: సుప్రీం కమిటీ సభ్యుల నేపథ్యం ఇదే....
ఇకపోతే దిశ దిశ ఘటనపై హోంమంత్రి మహ్మద్ ఆలీ కీలక వ్యాఖ్యలు చేశారు. దిశ డయల్ 100కు ఫోన్ చేసి ఉంటే బతికేదంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.మరో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి రక్షణ కల్పించడం సాధ్యం కాదని చెప్పారు. 

దిశ నిందితుల ఎన్ కౌంటర్ అనంతరం తెలంగాణ మంత్రులు విభిన్న రకాలుగా స్పందించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను మంత్రులు బహిరంగంగా స్వాగతించారు. ప్రతీ ఒక్కరినీ రక్షించలేమని అన్న తలసాని ఎన్‌కౌంటర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది సీఎం కేసీఆర్ ఉగ్రరూపం అంటూ చెప్పుకొచ్చారు. కేసీఆర్ మౌనాన్ని తక్కువ అంచనా వేశారని, ప్రస్తుతం దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు.  

తలసానితో పాటు ఎంపీ రంజిత్‌రెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్ ఎన్‌కౌంటర్‌ను గట్టిగా సమర్ధించారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు ఉండవని చెప్పుకొచ్చారు. ప్రతీ మహిళకు రక్షణ కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే మంత్రులుకు విభిన్నంగా ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.  చేశారు.

దిశ మృతదేహంలో మద్యం...పోలీసుల చేతికి కీలక ఆధారం...