కరీంనగర్ లో వాహనాల తనిఖీలు: రూ. 2 కోట్ల నగదు సీజ్

కరీంనగర్ పరిధిలో వాహనాల తనిఖీల సమయంలో రూ. 2 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.  నగదును తరలించే సమయంలో  సరైన  పత్రాలను తీసుకెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు.

Rs. 2 Crore  Unaccounted  cash seized in Karimnagar lns


కరీంనగర్:నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో  వాహనాల తనిఖీలు నిర్వహస్తున్న సమయంలో  రూ. రెండు కోట్ల లెక్క చూపని నగదును స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు.

సోమవారంనాడు  కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి  ఈ నగదుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే  అక్రమంగా మద్యం,  నగదు సరఫరాను అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టుగా ఆయన  చెప్పారు.ఆయా చెక్ పోస్టుల పరిధిలో ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న విషయాన్ని  సీపీ గుర్తు చేశారు.ఈ క్రమంలోనే  ఇవాళ కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని  కరీంనగర్ సర్క్యూట్ హౌస్ పరిధిలో  టూటౌన్ సీఐ రామచందర్ రావు  వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో లెక్క చూపని నగదు రూ. 2 కోట్లను సీజ్ చేసినట్టుగా సీపీ సుబ్బరాయుడు తెలిపారు. టీఎస్ 09 యూడీ 5198 నెంబర్ గల వ్యాన్ లో  రూ. 2,36,48, 494 లెక్క చూపని నగదును వ్యాన్ లో తరలిస్తుండగా  పోలీసులు సీజ్ చేశారన్నారు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల రిటర్నరింగ్ అధికారికి, ఈసీకి సమాచారం ఇచ్చినట్టుగా సీపీ వివరించారు.

also read:హైద్రాబాద్‌లో పోలీసుల తనిఖీలు: కవాడీగూడ,వనస్థలిపురంలో రూ. 3 కోట్లకు పైగా హవాలా నగదు సీజ్

ఎన్నికల కోడ్ విడుదలైన తర్వాత  ఇప్పటివరకు  2 కోట్ల  84 లక్షల 67 వేల 452 సీజ్ చేసినట్టుగా సీపీ తెలిపారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించేలా  అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.  ఇవాళ  లెక్క చూపని రూ. 2 కోట్లు సీజ్ చేసిన  సీఐ రామచందర్ రావు, ఎస్ఐ చిన్ననాయక్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, తదితరులను సీపీ  అభినందించారు.  ఈ సమావేశంలో  ఎన్నికల రిటర్నింగ్ అధికారి  కె. మహేశ్వర్, ఏసీపీ జి.నరేందర్, టూటౌన్  సీఐ కె. రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios