Asianet News TeluguAsianet News Telugu

హైద్రాబాద్‌లో పోలీసుల తనిఖీలు: కవాడీగూడ,వనస్థలిపురంలో రూ. 3 కోట్లకు పైగా హవాలా నగదు సీజ్

తెలంగాణ రాష్ట్రంలో  హవాలా మార్గంలో తరలిస్తున్న నగదును  పోలీసులు సీజ్ చేశారు. కవాడీగూడ, వనస్థలిపురంలలో సుమారు రూ. 3 కోట్లకు పైగా నగదును పోలీసులు సీజ్ చేశారు.

 Hyderabad Police  Seize Rs. 3 Crore Hawala Money, Eight Arrested lns
Author
First Published Oct 16, 2023, 3:23 PM IST


హైదరాబాద్: తెలంగాణలోని రెండు చోట్ల  పోలీసుల తనిఖీల్లో  భారీగా  నగదును పోలీసులు సీజ్ చేశారు. హైద్రాబాద్ నగరంలోని  కవాడీగూడ నుండి  బేగంబజార్  వైపు మూడు కార్లలో రూ. 2.9 కోట్ల నగదును తరలిస్తున్న సమయంలో  పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన నగదు హావాలా డబ్బుగా  పోలీసులు అనుమానిస్తున్నారు.   ఈ డబ్బును తరలిస్తున్న ఆరుగురిని  పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు వనస్థలిపురంలో కూడ పోలీసులకు  రూ. 30 లక్షల హావాలా నగదు పట్టుబడింది.   ఈ నగదును తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్ పై  రూ. 30 లక్షలను తరలిస్తున్న సమయంలో  ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. ఇవాళ ఉదయం  మియాపూర్ లో 27 కిలోల బంగారాన్ని  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు  ఈ నెల  9వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే  కోడ్ అమల్లోకి వచ్చిందని  ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో  రాష్ట్ర వ్యాప్తంగా  పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ సహా  పలు చోట్ల ప్రతి రోజూ పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట  నగదు, బంగారం , వెండిని పోలీసులు సీజ్  చేస్తున్నారు.

also read:హైద్రాబాద్‌లో 24 గంటల వ్యవధిలో ఐదు కేసులు: రూ. 4 కోట్లు సీజ్

ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నగదును హావాలా మార్గంలో తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో  హవాలా మార్గంలో తరలిస్తున్న నగదును పోలీసులు సీజ్  చేస్తున్నారు.  మద్యం, నగదు పంపిణీపై చర్యలు తీసుకోవాలని ఈసీ  తెలంగాణ రాష్ట్రానికి చెందిన  అధికారులకు సూచించింది. ఈ నెల  మొదటి వారంలో  రాష్ట్రంలో  సీఈసీ  నేతృత్వంలో ఈసీ  బృందం  పర్యటించింది.  ఎన్నికల సమయంలో  అధికారులు ఎలా వ్యవహరించాలనే విషయమై దిశా నిర్ధేశం  చేసింది  ఈసీ బృందం. మరో వైపు  ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన  పలువురు అధికారులను ఈసీ తప్పించిన విషయం తెలిసింది.  విధుల నుండి తప్పించిన  అధికారుల స్థానంలో కొత్త అధికారుల పేర్లను ఈసీ సూచించింది. దీంతో బదిలీ అయిన  అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియమించింది ప్రభుత్వం. 

Follow Us:
Download App:
  • android
  • ios