మైనార్టీలకు రూ.లక్ష సాయం.. మరో కొత్త పథకానికి తెలంగాణ సర్కారు శ్రీకారం

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల కోసం లక్ష రూపాయల సహాయ పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వారి కోసం ఇప్పటికే ఇదే త‌ర‌హా పథకం అమలులో ఉంది. కొత్త ప‌థ‌కానికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వు (జీవో) జారీ చేయ‌నుంద‌ని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.
 

Rs 1 lakh assistance to minorities Telangana govt launches another new scheme, State finance minister T Harish Rao RMA

Telangana finance minister T Harish Rao: తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల కోసం లక్ష రూపాయల సహాయ పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వారి కోసం ఇప్పటికే ఇదే త‌ర‌హా పథకం అమలులో ఉంది. కొత్త ప‌థ‌కానికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వు (జీవో) జారీ చేయ‌నుంద‌ని మంత్రి హ‌రీశ్ రావు తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. మైనార్టీలకు బ్యాంకు అనుమతి అవసరం లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.  హైద‌రాబాద్ నగరంలోని జలవిహార్ లో జరిగిన మైనార్టీల కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో) జారీ కానున్నాయని తెలిపారు. మంత్రి మహమూద్ అలీ విజ్ఞప్తి మేరకు రెండు రోజుల్లో ఫైలును ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారని హరీశ్ రావు తెలిపారు.

కాగా, రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల కోసం ఇప్పటికే ఇలాంటి పథకం అమలులో ఉంది. బీసీల కోసం ఈ పథకం కింద 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న చేతివృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారు. బీసీ-ఈ కేటగిరీ కింద నమోదైన ముస్లిం వర్గాలకు కూడా అదే ఆర్థిక సహాయం అందించాలని అసోసియేషన్ ఫర్ సోషియో-ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ది మార్జినలైజ్డ్ (ASEEM) రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల  ఈశ్వర్‌కు ఇటీవ‌ల విన‌త చేసింది.

ఇదిలావుండ‌గా, తెలంగాణ వ్యాప్తంగా గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో వైద్యసేవలు 24గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కురుస్తున్న వర్షాల సమయంలో రోగులకు కీలకమైన వైద్యసేవలు నాన్‌స్టాప్‌గా అందుబాటులో ఉండేలా చూసేందుకు మంత్రి గురువారం మధ్యాహ్నం అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios