కోదాడ వద్ద లారీ-బైక్ ఢీ, ప్రమాదంలో బైకర్, గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి

Road accident at kodad
Highlights

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోదాడ వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65 పై ఓ లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందగా, ఆందోళనతో లారీ డ్రైవర్ కు కూడా గుండెపోటుతో మరణించాడు.
 

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కోదాడ వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65 పై ఓ లారీ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతిచెందగా, ఆందోళనతో లారీ డ్రైవర్ కు కూడా గుండెపోటు వచ్చి మరణించాడు.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని కోదాడ మండలం కోమర బండ వద్ద లారీ డ్రైవర్ రాజేందర్ తన లారీని ఆపి టీ తాగాడు. అనంతరం రోడ్డు పక్కన నిలిపిన లారీని వెనక్కి తీసుకునే క్రమంలో అజాగ్రత్తగా వ్యవహరించి వెనకవైపునుండి వస్తున్న బైక్ ను గమనించలేదు. దీంతో లారీని బైక్ ని ఢీ కొట్టడంతో బైకర్ ఆసిఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో తీవ్ర ఆందోళనుకు గురైన లారీ డ్రైవర్ రాజేందర్ ఓ ప్రవైట్ వెహికిల్ లో అక్కడి నుండి పరారయ్యాడు. నేరుగా కోదాడ బస్టాండ్ కు చేరుకున్నాడు. అయితే ఓ ప్రాణాన్ని బలితీసుకున్నానని తీవ్ర మనోవేధనకు, ఆందోళనకు గురవడంతో రాజేందర్ గుండెపోటుకు గురయ్యాడు. అక్కడున్నవారు 108 కి సమాచారం అందించడంతో వారు చేరుకుని పరిశీలించడగా అప్పటికు రాజేందర్ మృతిచెందాడు.  

loader