విధి వంచించింది ఆపదలో ఉన్న కుటుంబాన్ని  ఓ ప్రమాదం మరింత ఆపదలోకి నెట్టేసింది. పిల్లలకు అమ్మను దూరం చెసింది, దుఖంలో ఉన్న అక్కను  ఓదార్ఛడానికి వచ్చిన వారి మృతువు కబళించింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన అన్నాడి రవికుమార్‌రెడ్డి(50) నగరంలోని అల్వాల్‌లో భార్యా పిల్లలతో కలిసినివాసం ఉంటున్నాడు. ఓ లాయర్‌ వద్ద క్లర్కుగా పనిచేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు.

అయితే శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. దీంతో ఆయనకు హుస్నాబాద్‌‌ దగ్గరలో ఉన్న స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు నిర్ణయించారు. ఈ క్రమంలో రవికుమార్‌రెడ్డి భార్య జ్యోతి,   హైదరాబాద్‌లోనే నివసిస్తున్న జ్యోతి చెల్లెళ్లు రాణి, సునీత మకరికొంత మంది బంధువులతో కలిసి ప్రైవేటు అంబులెన్సులో అంతక్రియల కోసం బయల్దేరారు

అప్పటి వరకు టచ్‌లోనే ఉండి అంతలోనే..

విషాదంలో ఉన్నవారిపై ఇంకా  కసి చల్లారని ఆ దేవుడు రోడ్డు ప్రమాదం రూపంలో ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేశాడు. సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రిచెప్యాల టీ జంక్షన్‌ వద్ద అతివేగంతో వచ్చిన మినీలారీ  అంబులెన్సుని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ప్రమాదం ఎంతటి తీవ్రతో జరిగిందంటే ఆ లారీ వేగంగా ఢీకొట్టడంతో రాణి, సునీతల శరీరాలు  నుజ్జయ్యాయి. ఆ వాహనంలో జ్యోతి సహా అందరికి తీవ్ర గాయలయ్యాయి.

భర్త మరణించడంతో శోక సంద్రంలో మునిగిపోయిన తనకు  చెల్లెళ్లిద్దరూ అండగా  నిలుస్తారనుకుంటే చివరకు వారి ప్రాణాలను తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు. భర్త చావుతో పుట్టెడు దుఃఖంలో ఉన్న జ్యోతికి వారి మరణం మరింతగా కుంగదిసింది. చెల్లెళ్లిద్దరూ మాంసం ముద్దలుగా కళ్లెదుటే కనిపించడంతో ఆమె  బాధ అనిర్వచనీయమైనది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతిఒక్కరిని కంటతడి పెట్టిచింది.

చిన్నారి మృతి ఎఫెక్ట్: షైన్ ఆసుపత్రి సీజ్

జ్యోతి, రాణి, సునీత ముగ్గురు అక్కాచేల్లాలు. వీరు భర్త పిల్లలతో కలసి హైదరాబాద్‌లోని వేరువేరు ప్రాంతాలలో నివసిస్తున్నారు. ప్రమాదంలో మరిణించిన రాణికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా సునీతకు ఓ కుమారుడు  ఓ కుమార్తె ఉన్నారు. అలాగే జ్యోతి రవికుమార్‌రెడ్డికి ముగ్గురు ఆడపిల్లలు, వారిలో  ఒక్కరికి ఇటీవలే వివాహం జరిగింది.  వారికి పెద్దిదిక్కుగా ఉన్న రవికుమార్‌రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్న ఆ కుటుంబానికి ఆ ఇద్దరి మరణం తీరని దుఖాన్ని మిగిల్చింది.