శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మహిళ అదృశ్యం కలకలం రేపుతోంది. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు విమానంలో  వచ్చిన లక్ష్మీ భవానీ అనే మహిళ కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై   శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమె అచూకి కోసం  గాలింపు చర్యలు చెపట్టారు. 

పశ్చిమగోదావరి జిల్లా కాపవరం గ్రామానికి చెందిన లక్ష్మీ భవానీ బతుకుదెరువు కోసం మస్కట్‌ వెళ్లింది. కొంత కాలం అక్కడి పనిచేసిన లక్ష్మి  ఇటీవలే సొంత ఊరికి 
రావలని నిర్ణయించుకుంది. ఈ నెల 10న మస్కట్‌ నుంచి హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది భవానీ. అప్పటివరకు ఫోన్‌లో ఇంటివారితో కమ్యూనికేషన్
లో ఉన్న భవాని ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే వారి ఫోన్ కాల్‌కు స్పందించలేదు. పోన్ స్విచ్ ఆఫ్‌  రావడంతో తల్లిదండ్రులలో కంగారు మెుదలైంది. 

Also read బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం టీమ్

 ఆమెకు కోసం రెండు రోజులు వెచి చూసినప్పటికి  ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు భవాని కోసం బంధువుల ఇళ్ళల్లో గాలించారు. ఎంత వెతికినప్పటికి భవాని అచూకి మాత్రం లభ్యం కాలేదు. పది రోజులు గడుస్తున్న ఆమె గురించి ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో చేసేది ఏమిలేక  ఎశంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

also read సెక్స్ అప్పుడే ఎంజాయ్ చేయగలం..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎయిర్‌పోర్టులోని సీసీ కెమెరా దృశ్యాలను  పరిశీలిస్తున్నారు. భవానిని ఎవరైనాకిడ్నాప్ చేశారా? లేక ఆమె ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.