Asianet News TeluguAsianet News Telugu

వరి వార్.. తెలంగాణలో ముదురుతున్న ధాన్యం కొనుగోళ్ల వివాదం..

యాసంగి ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. 

Rice war .. Rising grain procurement controversy in Telangana ..
Author
Hyderabad, First Published Dec 23, 2021, 12:59 PM IST

తెలంగాణలో వరి కొనుగోళ్ల వివాదం మరింత ముదురుతోంది. రోజు రోజుకు ఈ వ్యవహారం మరింత జఠిలమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విష‌యంలో ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నాయి. త‌ప్పు మీదంటే మీద‌ని కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటున్నారు. హుజూరాబాద్ ఎన్నిక‌లకు ముందు మొద‌లైన ఈ వరి వార్ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. 

ఫెయిలైన ఇంటర్ విద్యార్థులకు న్యాయం కోసం: ఇంటర్ బోర్డు వద్ద జగ్గారెడ్డి దీక్ష

ఏటూ తేల‌ని పంచాయితీ.. 
వ‌రి కొనుగోళ్ల విష‌యంలో పంచాయితీ ఇంకా తెగ‌డం లేదు. ఈ విష‌యంలో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రెండూ మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. యాసంగి వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యంలో గ‌త రెండు నెల‌లుగా వివాదం నెల‌కొని ఉంది. ఈ శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంలోనూ వ‌రి విష‌యంలో చ‌ర్చ జ‌రిగింది. కేంద్ర మంత్రులు ఈ విష‌యంలో ప‌లు మార్లు మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్లివ‌చ్చారు. అయినా ధాన్యం కొనుగోలు అంశం కొలిక్కి రావ‌డం లేదు. 

సహజీవనం చేసి, దూరం పెట్టిందని.. మహిళ సజీవదహనం..

ఈ యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో స్ప‌ష్టత ఇవ్వాల‌ని కోరుతూ రాష్ట్ర మంత్రులు రెండు సార్లు ఢిల్లీకి వ‌చ్చారు. ఒక సారి స్వ‌యంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. కానీ ప్ర‌ధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ దొర‌క్కపోవ‌డంతో వెనుదిరిగి వ‌చ్చారు. అయితే ఈ విష‌యంలో ప్ర‌ధాని కార్యాల‌యం స్పందించింది. ప్ర‌ధాని అపాయింట్ మెంట్ కోసం సీఎం ప్ర‌య‌త్నించ‌లేద‌ని తెలిపింది. ఇటీవ‌ల మ‌ళ్లీ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రులను క‌లిసి వ‌రి కొనుగోళ్ల విష‌యంలో స్పష్టమైన హామీ కావాల‌ని కోరి, లిఖిత‌పూర్వ‌కంగా హామీకావాల‌ని కోరేందుకు వెళ్లారు. కానీ అక్క‌డ మ‌ళ్లీ అక్క‌డ కేంద్ర మంత్రులు స‌మ‌యం ఇవ్వ‌లేద‌ని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశారు. మ‌రుసటి రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ ఈ విష‌యంలో మీడియాతో మాట్లాడారు. అస‌లు తాము ఢిల్లీలో లేని స‌మ‌యంలో చూసుకుని తెలంగాణ‌కు చెందిన మంత్రుల బృందం ఇక్క‌డికి వ‌చ్చింద‌ని, వాళ్ల‌కు వేరే ప‌ని ఏం లేన‌ట్టు ఉంద‌ని వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ మంత్రులు భ‌గ్గుమ‌న్నారు. నిన్న మంత్రి హారీశ్‌రావు, జ‌గ‌దీష్ రెడ్డి విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. త‌మ మంత్రులు ప‌నిలేక ఢిల్లీ వెళ్ల‌లేద‌ని యాసంగిలో వ‌రి కొంటారా ? కొన‌రా ? దీనిపై స్ప‌ష్ట‌మైన హామీ తీసుకునేందుకు ఢిల్లీకి వ‌చ్చామ‌ని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ‌మే రైతు వ్య‌తిరేక విధానాలు అవ‌లంభిస్తుందని అన్నారు. పీయూష్ గోయ‌ల్ వ్యాఖ్య‌లు స‌రిగా లేవ‌ని అన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి ఒకే విధంగా ధాన్యం సేక‌రించాల‌ని చెప్పారు. వానాకాలం సీజ‌న్‌కు సంబంధించి ఇప్ప‌టికే 50 లక్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం సేక‌రించామ‌ని, మ‌రో 30 ల‌క్ష‌లు సేక‌రిస్తామ‌ని తెలిపారు. వాటిని మిల్లుల నుంచి తీసుకెళ్లాల్సిన బాధ్య‌త ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని, పైగా త‌ప్పు తెలంగాణ ప్ర‌భుత్వానిదే అంటోంద‌ని అన్నారు. 

క్రిస్‌మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలి: తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
ఇలా కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారే త‌ప్ప‌.. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో సౌమ్యంగా చ‌ర్చించి ఒక ప‌రిష్కారం క‌నుగొన‌లేక‌పోతున్నారు. ఈ రెండు ప్ర‌భుత్వాల తీరు వ‌ల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios