Asianet News TeluguAsianet News Telugu

సహజీవనం చేసి, దూరం పెట్టిందని.. మహిళ సజీవదహనం..

బుధవారం సాయంత్రం ఆమె కుమారుడు విధులకు వెళ్ళాడు. రాత్రి 8 గంటల సమయంలో వెంకటేష్  ఆమె వద్దకు వెళ్ళాడు.  ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో నుంచి మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించి స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా కాలిన గాయాలతో వెంకటలక్ష్మి చనిపోయి ఉంది.

man set on fire women in kukatpally
Author
Hyderabad, First Published Dec 23, 2021, 12:14 PM IST

మూసాపేట్ :  తనతో సహజీవనం చేసిన మహిళను ఓ వ్యక్తి సజీవ దహనం చేశాడు. కూకట్పల్లి సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం వెంకటలక్ష్మి (50) నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రి లో Contract sweeper గా పనిచేస్తుంది. Disability pensioner కూడా.  పదేళ్ల క్రితమే భర్త చనిపోయాడు. ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహం చేసింది. జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉండే వెంకటేష్ (55)తో పరిచయం ఏర్పడింది.

వెంకటేష్ భార్య చనిపోగా కుమారుడితో ఉంటున్నాడు. అతనికి స్థానికంగా వెల్డింగ్ దుకాణం ఉంది. ఇద్దరూ పదేళ్ల పాటు కలిసి సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో వెంకట లక్ష్మి తన కుమారుడితో కలిసి కూకట్పల్లి ప్రశాంత్ నగర్ కు మకాం మార్చింది. తనతోనే ఉండాలని వెంకటేష్ పలుమార్లు ఒత్తిడి తెచ్చి వేధించాడు. ఆమె ససేమిరా అనడంతో పగ పెంచుకున్నాడు.  

బుధవారం సాయంత్రం ఆమె కుమారుడు విధులకు వెళ్ళాడు. రాత్రి 8 గంటల సమయంలో వెంకటేష్  ఆమె వద్దకు వెళ్ళాడు.  ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇంట్లో నుంచి మంటలు ఎగిసి పడుతుండటాన్ని గమనించి స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా కాలిన గాయాలతో వెంకటలక్ష్మి చనిపోయి ఉంది.

వెంకటేష్ సైతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతుండడంతో అతన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గొడవ జరగడంతో ఆవేశంలో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ క్రమంలో అతనికీ మంటలు అంటుకుని ఉంటాయి అని అనుమానిస్తున్నారు. ఎస్సై పి. సురేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

హైదరాబాద్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. కాలేజ్ హాస్టల్ బిల్డింగ్‌పై నుంచి దూకి బలవన్మరణం.. సూసైడ్ నోట్‌లో..

ఇదిలా ఉండగా, sales tax officials వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో dcm driverఅస్వస్థతకు గురై మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. అయితే ఆకస్మికంగా కింద పడి తన తండ్రి చనిపోయినట్లు మృతుడి కుమారుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, అడిగినంత లంచం ఇవ్వలేదని సేల్స్ టాక్స్ అధికారులు ప్లాస్టిక్ పైప్ తో కొట్టి చంపారని eyewitnessగా ఉన్న డిసిఎం క్లీనర్ అంటున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్ కు చెందిన ననబీలాల్ సదాఫ్ (48) ఏపీ లోని గుంటూరు నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు డీసీఎం వ్యాన్ లో సామాగ్రితో బుధవారం వెళుతున్నాడు. తుర్కపల్లి లో భువనగిరికి చెందిన కమర్షియల్ టాక్స్ అధికారులు నబీలాల్‌ సదాఫ్‌ డిసిఎంను ఆపారు. ఆ సమయంలో నబీలాల్‌ సదాఫ్‌ ఆకస్మికంగా కింద పడడంతో ఇతర లారీ  డ్రైవర్లు,  కమర్షియల్ టాక్స్ అధికారులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భువనగిరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయినట్లు నబీలాల్‌ సదాఫ్‌ కొడుకు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే నబీలాల్‌ సదాఫ్‌ ది సహజ మరణం కాదని అధికారులే చంపారని క్లీనర్ చెబుతున్నాడు. ఆ రోజు అధికారులు లోడ్ ను తనిఖీ చేసి వాహన కాగితాలు పరిశీలించారని.. వాహనాన్ని పక్కకు నిలిపి రెండు లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని క్లీనర్ ఆరోపించారు. ఈ విషయమై డీసీఎం డ్రైవర్ ట్రాన్స్ పోర్ట్ యజమానులకు ఫోన్ చేసి విషయం చెప్పి 15 వేల రూపాయలు ఇస్తానని బతిమిలాడినా ఒప్పుకోలేదని, అధికారి దినేష్ కోపోద్రిక్తుడై  నబీలాల్‌ సదాఫ్‌ కాళ్లపై ప్లాస్టిక్ పైపుతో కొట్టాడన్నారు.

దీంతో నబీలాల్‌ సదాఫ్‌ ప్యాంటు లోనే మూత్రవిసర్జన చేసుకుని అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే సేల్స్ టాక్స్ అధికారుల కారులోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని, అక్కడి నుంచి భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios