రేవంత్ జరిపిన ఆత్మీయ సభపై రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్

రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసం వద్ద భారీ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు పలు నియోజకవర్గాల ముఖ్య నాయకులు సైతం ఆ సభలో పాల్గొన్నారు. టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపి డాక్టర్ మల్లు రవి ఈ సమావేశానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలికారు.

ఈ సమావేశంలో టిడిపి కి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బోడ జనార్దన్, టిఆర్ఎస్ నేత దొమ్మాటి సాంభయ్య, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, దేవని సతీష్ మాదిగ, రాజారాం యాదవ్, మేడిపల్లి సత్యం, టిఆర్ఎస్ నేత చింపుల సత్యనారాయణ రెడ్డి, ఓయు జెఎసి నాయకురాలు బాలలక్ష్మితోపాటు పలువురు ప్రముఖులు కూడా రేవంత్ సభలో పాల్గొని రేవంత్ బాటలో నడుస్తామని ప్రకటించారు.

ఇక ఈ సభకు రాకుండ జనాలను కంట్రోల్ చేసేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రమైన కుట్రలు చేశారని రేవంత్ వర్గం ఆరోపించింది. కొడంగల్ నుంచి ప్రజలు తరలిరాకుండా పోలీసులు రోడ్ల మీద పహారా వేసి వాహనాల చెక్ పేరుతో వాహన యజమానులను భయపెట్టే పనిచేశారని ఆరోపించారు. అయినా జనాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అయితే ఈ సభలో అన్నీ బాగానే జరిగినా ఒక లోపం కొట్టొచ్చినట్లు కనబడింది. తెలంగాణలో పంచ్ డైలాగులతో సామాన్య జనాలకు సైతం అర్థమయ్యేలా మాట్లాడే నాయకుల జాబితాలో రేవంత్ రెడ్డి ప్రథమ శ్రేణిలో ఉంటారు. ఆయన ఎక్కడ సభలో మాట్లాడినా అదరగొడతాడు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి తన ప్రసంగం బాగానే చేశాడు కానీ... ఆయన గొంతు బొంగురుపోయింది. దీంతో ఆయన వాయిస్ అంత క్లారిటీగా వినిపించలేదు. టివిల్లో చూసిన వారు సైతం ఆ గొంతు విని అసలు మాట్లాడేది రేవంతేనా అని అనుమానపడ్డారు. మొత్తానికి రేవంత్ గత వారం రోజులుగా మాట్లాడుతూ ఉండడంతో గొంతు బొంగురుపోయినట్లు కనబడుతున్నది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/oS3BpF