జడ్చర్లలో రేవంత్ రెడ్డి ర్యాలీ ఉద్రికత్త (వీడియో)

First Published 29, Dec 2017, 3:54 PM IST
Revanth Rally leads to tension in Jadcherla
Highlights
  • జడ్చర్లలో ములాఖత్ ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్
  • హాజరైన మల్లు రవి, రేవంత్ రెడ్డి
  • అడ్డు తగిలిన టిఆర్ఎస్ శ్రేణులు
  • ఇరు వర్గాల మధ్య కొట్లాట

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నేతలు మల్లు రవి, రేవంత్ రెడ్డి జడ్చర్లలో శుక్రవారం పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  చేపట్టిన ములాఖత్ ర్యాలీలో వీరు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ కార్యకర్తలు కొందరు కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఉధ్రిక్తత చోటు చేసుకుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.

గత నెల రోజుల నుండి రేవంత్ రెడ్డి మరియు మంత్రి లక్ష్మా రెడ్డి మధ్య మాటల యుద్దo జరుగుతున్న తరుణంలో ఇవాళ ర్యాలీలో ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీని ఖరాబ్ చేయాలన్న దురుద్దేశంతోనే టిఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని కాంగ్రెస్ వారు ఆరోపించారు. అయితే జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి లక్మారెడ్డిపై రేవంత్ పరుష వ్యాఖ్యలు చేసినందున తక్షణమే క్షమాపణ చెప్పాలని తాము డిమాండ్ చేసే ప్రయత్నం చేశామని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మొత్తానికి పోలీసుల సమయస్పూర్తితో కొట్లాట పెద్దది కాకుండా సద్దుమణిగింది. ఇరు వర్గాల మధ్య కొట్లాట వీడియో కింద చూడొచ్చు.

loader