అనర్హత పిటిషన్ పై చర్య తీసుకోవాలని వినతి

తెదేపా నుంచి తెరాసలో చేరిన 12 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై డిసెంబరు 20లోగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ మధుసూదనాచారిని తెలుగుదేశం శాసనసభాపక్షనేత రేవంత్‌రెడ్డి కోరారు.

తాము ఇచ్చిన పిటిషన్‌లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని గుర్తు చేస్తూ స్పీకర్‌కు లేఖ రాశారు. హైకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందని, అయినా సమాధానం లేదని ఆక్షేపించారు.

గడువులోగా నిర్ణయం తీసుకోకపోతే తాము మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుందని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.