రేవంత్ కు తొలి ఝలక్ ఇచ్చిన టిఆర్ఎస్ (2 వీడియోలు)

revanth fallowers joined in trs at telangana bhavan
Highlights

  • 700 రేవంత్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరినట్లు ప్రకటన
  • తొలిసారి ఫలించిన అధికార పార్టీ ప్రయత్నాలు
  • పట్నం మహేందర్ రెడ్డి చొరవతో కదిలిన కొడంగల్ కార్యకర్తలు

 

రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పాగా వేసి ఎలాగైనా రేవంత్ అనుచరులకు గులాబీ తీర్థం ఇప్పించాలనుకున్న టిఆర్ఎస్ ప్రయత్నాలు స్వల్పంగా సలమయ్యాయి. గత వారం రోజులుగా తెలంగాణ మంత్రులు తీవ్రమైన ప్రయత్నాలు చేశారు. అయితే వారు ఇప్పుడిప్పుడే పట్టు సాధిస్తున్నారు. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలం నాయకులు, కార్యకర్తలను టిఆర్ఎస్ లో చేర్పించుకున్నారు. తెలంగాణ భవన్ లో మంగళవారం సాయంత్రం మంత్రి పట్నం మహేందర్ రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. 700 మంది టిఆర్ఎస్ లో చేరినట్లు నాయకులు ప్రకటించారు. తెలంగాణ భవన్ లో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ , రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి  సమక్షంలో  కొడంగల్ నియోజకవర్గం లోని కోడంగల్  , దౌల్తాబాద్ మండలాల దాదాపు టీడీపీ , కాంగ్రెస్  700 మంది  కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కండువాలు కప్పి స్వాగతం పలికారు మంత్రులు మహమూద్ ఆలీ, మహేందర్ రెడ్డిలు.

టిఆర్ఎస్ లో చేరిన వారి వివరాలు...

శరణమ్మ  హనుమంతురెడ్డి కొడంగల్ హెడ్ క్వాటర్ ZPTC

ప్రవీణ్ కుమార్ గౌడ చిట్ల పల్లి MPTC కొడంగల్ మండలం

మహిపాల్ రెడ్డి దౌల్తాబాద్ టి.డి.పి మండల పార్టీ అధ్యక్షుడు

పార్వతమ్మ  టి డి పి సర్పంచ్ దౌల్తాబాద్

మధుసూదన్ రెడ్డి టి.డి.పి సర్పంచ్ గుండెపల్లి

మాధవి టి డి పి సర్పంచ్  చంద్రకల్

ఆశన్న ఉప సర్పంచ్ చంద్రకల్

జాకీర్ దౌల్తాబాద్ మండలం

కో. ఆప్షన్ మెంబెర్

చిన్నారెడ్డి Ex.MPTC చెన్నారం కోస్గి మండలం

కళావతి  టిడిపి సర్పంచ్ ( ప్రస్తుతం ) బిజ్జరాం.

వడ్ల వెంకటయ్య  Ex.సర్పంచ్ బిజ్జరాం .

పటేల్ బస్వరాజు టి డి పి విలేజ్ ప్రెసిడెంట్  బిజ్జరాం.

బసంత్ రెడ్డి Ex. ఉప సర్పంచ్ అంతారం దౌల్తాబాద్ మండలం

రాజప్ప PACS డైరెక్టర్ దౌల్తాబాద్.

ఆనంతయ్య Ex.MPTC గోకపస్లాబాద్..దౌల్తాబాద్ మండలం

దౌల్తాబాద్ మండల హెడ్ క్వాటర్ వార్డ్ మెంబర్స్  నారాయణ, ఎల్లమ్మ, మల్కాయ్య గౌడ్, శ్రీనివాస్

loader