సిఎం ఫాంహౌస్ లో గత నాలుగు రోజులుగా కెసిఆర్ ను ఎవరెవరు కలుస్తున్నారో వెల్లడించాలి.  మియాపూర్ భూముల కుంభకోణంతో సంబంధం ఉన్నవారు సిఎంను ఫాం హౌస్ లో కలుస్తున్నారు. తక్షణమే డిప్యూటీ సిఎం ను బర్తరఫ్ చేయాలి.

సిఎం ఫాంహౌస్ లో గత నాలుగు రోజులుగా కెసిఆర్ ను ఎవరెవరు కలుస్తున్నారో వెల్లడించాలని టిడిపి వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డిడిమాండ్ చేశారు. మియాపూర్ భూముల కుంభకోణంతో సంబంధం ఉన్నవారు సిఎంతో ఫాం హౌస్ లో సమావేశం అవుతున్నట్లు ఆయన ఆరోపించారు.

మియాపూర్ భూముల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ టిడిపి కలెక్టరేట్ల ముట్టడికి దిగింది. రంగారెడ్డి కలెక్టరేట్ ముందు టిడిపి నేతలు ధర్నా చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం సబ్ రిజిస్ట్రార్ లను అరెస్టు చేసి సర్కారు చేతులు దులుపుకుందన్నారు. నయీం కేసు, ఇందిరమ్మ ఇండ్లు, ఎంసెట్ కేసు, సిఎంఆర్ఎఫ్ కుంభకోణాలను సిఐడికి అప్పగించినా...ఇంతవరకు అతీగతీ లేదని రేవంత్ ఆరోపించారు. తక్షణమే డిప్యూటీ సిఎం ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూముల్లో డబుల్ బెడ్రూముల ఇండ్లు కట్టించి పేదలకు ఇవ్వాలన్నారు. భూముల కుంభకోణంపై సిబిఐ విచారణ జరిపించాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కె 4 దోపిడీ జరుగుతుందని విమర్శించారు టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్ రమణ. కెసిఆర్ నుంచి ప్రభుత్వ భూములను కాపాడుకుంటామన్నారు రమణ.