Asianet News TeluguAsianet News Telugu

కుందన్ బాగ్ లో బూత్ బంగ్లా అంటూ రీల్స్.. 20మంది యువకులు అరెస్ట్..

బూత్ బంగ్లా పేరుతో రీల్స్ చేస్తూ వైరల్ చేస్తున్న 20 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని కుందన్ బాగ్ లో ఈ ఘటన వెలుగు చూసింది. 

Reels on Booth bungalow in Kundan Bagh goes viral, 20 youths arrested, hyderabad - bsb
Author
First Published Oct 27, 2023, 11:13 AM IST | Last Updated Oct 27, 2023, 11:12 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ కుందన్ బాగ్ లో కొంతమంది యువకులు ఓ బంగ్లాలో అర్థరాత్రి రీల్స్ చేస్తున్నారు. భూత్ బంగ్లా అంటూ రీల్స్ లో చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సదరు యువకులను తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. 

బూత్ బంగ్లా పేరుతో ప్రచారం చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. రీల్స్ చేస్తున్న 20 మంది యువకులను గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరు రీల్స్ చేసిన ఆ భవనంలో 14 ఏళ్ల క్రితం తల్లి, ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పద మృతి చెందారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తల్లి, ఇద్దరు కూతుళ్ళ అనుమానాస్పద మృతి మిస్టరీగానే ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios