మరో సమరానికి సై అంటున్న తెలుగు రెడ్డీలు

First Published 25, Dec 2017, 6:04 PM IST
Reddys of world uniting for their caste cause
Highlights
  • రిజర్వేషన్ల సాధన అంశాన్ని బలంగా తీసుకుపోవాలని నిర్ణయం
  • రెడ్డి బంధువులకు ప్రమాద బీమా కల్పించే ప్లాన్

రెడ్డీల అభ్యున్నతి కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రెడ్డీలందరినీ సమీకరించి భారీ సభ ఏర్పాటు చేసేందుకు రెడ్డి జాగృతి సిద్ధమవుతోంది. దాదాపు 5 లక్షల మందితో రెడ్డి జన జాగృతి మహా సభను హైదరాబాద్ లో జరపనున్నట్లు జాగృతి ప్రతినిధులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో జనవరి 28వ తేదీన ఈ సభ జరగనుంది.

హైదరాబాద్ లో ఈనెల 19, 20 తేదీల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర, కార్యవర్గ సమావేశం లో విస్తృత స్థాయిలో చర్చించి , పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 28 తేదీన జరగనున్న మహాసభ గురించి రెడ్డి బంధువులకు , రెడ్డి మిత్రులకు విస్తృతంగా ప్రచారం చేయాని ప్రతినిధులు నిర్ణయించారు. ఇప్పటికే ప్రచారం ఊపందుకున్నది.

రెడ్డి జాగృతి ని గ్రామ స్థాయి నుండి మొదలుకొని విశ్వ వ్యాప్తంగా విస్తృత పరచడానికి అమలు పరచవలసిన కార్యాచరణ నిర్ణయించారు. ప్రతీ గ్రామీణ రెడ్డి బంధువుకూ రెడ్డి_సోషల్_సెక్యూరిటీ_కార్డ్ ( 2 లక్షల ప్రమాద భీమాతో)" అనే ఉచిత మెంబర్ షిప్ కార్యక్రమం చేపట్టి ప్రతీ రెడ్డి బంధువుకూ ఉచిత రెడ్డి మెంబర్ షిప్ నమోదు కార్యక్రమం నిర్వహించడానికి నిర్ణయించారు.

రెడ్డి జాగృతి భావజాలానికి, ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల పై క్రమశిక్షణ చర్యలు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. రెడ్డి జాతి ఔన్నత్యాన్ని అభివృద్ధి కీ పాటుపడుతూ, రెడ్డి విద్యార్ధి, యువత, మహిళ, రైతు సంక్షేమం, హక్కుల సాధనకై నిరంతరంగా శ్రమిస్తూ, లక్ష్య సాధన దిశగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు.

లక్ష్య సాధనకై అన్ని జిల్లాలో రెడ్డి భరోసా సమావేశాలతో భారీ కార్యాచరణను రూపొందించడానికి అవసరమైన పలు అంశాల పై విస్తృత స్థాయిలో చర్చించినట్లు రెడ్డి జాగృతి కీలక నేత శ్రీనివాసరెడ్డి ఏషియానెట్ కు చెప్పారు. జనవరి 28న జరగనున్న సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. జనవరి 28 సభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయన్నారు. రెడ్డి జాగృతి సమాచారం కోసం ఈ కింది ఇచ్చిన ఫార్మాట్ లో సంప్రదించాలని శ్రీనివాసరెడ్డి సూచించారు.


రెడ్డి జాగృతి & రెడ్డి హెల్ప్ లైన్
8686272828 & 8096095555
Whatsapp Group No : 9550493388
http://www.reddyjagruthi.com

loader