కారణమిదీ:ఆలస్యం కానున్న ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం
ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గురువారం నాడు రాత్రి కురిసిన వర్షం కారణంగా ఇవాళ ఉదయం నిమజ్జనానికి విగ్రహం తరలించే పనులు ఆలస్యమయ్యాయి.
హైదరాబాద్: ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఆలస్యమయ్యే అవకాశం కన్పిస్తుంది. ఖైరతాబాద్ పంచముఖి మహా గణపతి విగ్రహ నిమజ్జనం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నిన్న రాత్రి కురిసిన వర్షంతో వినాయక విగ్రహనికి సపోర్టుగా ఏర్పాటు చేసిన కర్రలతో పాటు విగ్రహం చుట్టూ ఉన్న బారికేడ్ల తొలగింపు ఆలస్యమైంది. ఖైరతాబాద్ పంచముఖి గణపతికి శుక్రవారం నాడు చివరి పూజలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రినివాస్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ,, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర్వహించారు. పూజలు పూర్తైన తర్వాత విగ్రహన్ని టస్కర్ వాహనంలోకి ఎక్కించే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఖైరతాబాద్ విగ్రహన్ని ట్యాంక్ బండ్ పై తరలించేందుకు గాను ప్రత్యేక టస్కర్ వాహనాన్ని ఉపయోగిస్తారు. టస్కర్ వాహనంపైకి గణేష్ విగ్రహన్ని జాగ్రత్తగా ఎక్కించిన తర్వాత శోభాయాత్ర ప్రారంభించనున్నారు. అయితే ఈ ఏడాది టస్కర్ వాహనం డ్రైవర్ కూడ కొత్తవాడు. దీని కారణంగా కూడా ఖైరతాబాద్ వినాయక విగ్రహం టస్కర్ వాహనంపైకి ఎక్కించేందుకు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా అయితే ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్ గణేష్ విగ్రహ శోభాయాత్ర ప్రారంభమయ్యేది. ట్యాంక్ బండ్ కు మధ్యాహ్నం 1 గంట లోపుగా చేరేది. అయితే ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నిమజ్జనం కొంత ఆలస్యంగా ట్యాంక్ బండ్ కు చేరే అవకాశం ఉంది.
also read:వందల నుండి లక్షలకు చేరిన వేలం: బాలాపూర్ లడ్డూ వేలం చరిత్ర ఇదీ
ప్రతి ఏటా ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన 4 నెంబర్ క్రేన్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. ట్యాంక్ బండ్ వద్ద వినాయక విగ్రహల నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేశారు. ట్యాంక్ బండ్ పై 15, ఎన్టీఆర్ మార్గ్ లో 9, పీపుల్స్ ప్లాజా వద్ద 8 క్రేన్లు ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 33 చెరువుల వద్ద వినాయక విగ్రహల నిమజ్జనం చేయనున్నారు. అంతేకాదు గ్రేటర్ పరిధిలో 74 బేబీ పాండ్స్ లలో కూడ వినాయక విగ్రహల నిమజ్జనం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.