వందల నుండి లక్షలకు చేరిన వేలం: బాలాపూర్ లడ్డూ వేలం చరిత్ర ఇదీ
బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకోవడానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున పోటీ పడుతుంటారు. బాలాపూర్ లడ్డూ వేలంలో ఎంతకు కొనుగోలు చేస్తారోననే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంటుంది. వందల నుండి ప్రారంభమైన లడ్డూ వేలం పాట ప్రస్తుతం లక్షలకు చేరుకుంది.
హైదరాబాద్: వినాయక చవితి వచ్చిందంటే ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ లడ్డూ వేలం గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిందే. వినాయక నవరాత్రోత్సవాలు ముగిసిన తర్వాత బాలాపూర్ లడ్డూను వేలం వేస్తారు. ఈ ఏడాది రూ. 24.60 లక్షలకు వంగేటి లక్ష్మారెడ్డి బాలపూర్ లడ్డూను దక్కించుకున్నారు. బాలాపూర్ లడ్డూను దక్కించుకొనేందుకు గాను పోటీలు పడి వేలం పాటలో పాల్గొంటారు. ఈ దఫా కూడా వంగేటి లక్ష్మారెడ్డి వేలం పాటలో అధిక పాట పాడి లడ్డూను దక్కించుకున్నారు.
బాలాపూర్ లడ్డా వేలం పాట 1994లో ప్రారంభమైంది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతి ఏటా వినాయక విగ్రహన్ని ఏర్పాటు చేస్తారు. నవరాత్రోత్సవాలు ముగిసిన తర్వాత గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలం పాట నిర్వహిస్తారు.తొలుత వందల్లో ప్రారంభమైన వేలం పాట ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. 1994 లో రూ. 450 లకు కొలను కుటుంబ సభ్యులు ఈ లడ్డూను దక్కించుకున్నారు. ప్రతి ఏటా ఈ లడ్డూ వేలం పాటు వందల నుండి వేలు, లక్షలకు చేరుకుంది. ఈ లడ్డూను దక్కించుకొన్న కుటుంబాలకు అన్ని రకాలుగా మంచి జరుగుతుందనే భావన స్థానికుల్లో ఉంది. దీంతో ఈ లడ్డూ వేలం పాటలో పాల్గొంటారు.
ప్రతి ఏటా తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరం నుండి బాలాపూర్ గణేషుడికి లడ్డూను అందిస్తారు. గత ఏడాది 18 కిలోల లడ్డూను అందించారు. ఈ ఏడాది 20 కిలోలకు పైగా లడ్డూను అందించారు. బాలాపూర్ లడ్డూను వేలం పాటలో కొలను కుటుంబ సభ్యులు 9 దఫాలు దక్కించుకున్నారు. ఈ అడ్డూను అత్యధిక దఫాలు దక్కించుకొంది కూడా కొలను కుటుంబ సభ్యులే.
also read:రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ: రూ. 24.60 లక్షలకు దక్కించుకున్న లక్ష్మారెడ్డి
తొలిసారి 1994లో జరిగిన వేలం పాటలో కొలను మోహన్ రెడ్డి కుటంబం రూ.450 లకు లడ్డూను దక్కించుకొంది. 1995లో కూడ కొలనుమోహాన్ రెడ్డి కుటుంబం రూ. 4500లకు లడ్డూను దక్కించుకొంది. 1996లో కొలను కృష్ణారెడ్డి రూ.18వేలకు, 1997లో కొలను కృష్ణారెడ్డి రూ.28వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 1998లో కొలను మోహన్ రెడ్డి రూ. 51వేలకు,.1999 లో కళ్లెం ప్రతాప్ రెడ్డి రూ.65వేలకు లడ్డూను దక్కించుకొన్నారు.
2000 లో కళ్లెం అంజిరెడ్డి రూ.66వేలకు లడ్డూను దక్కించుకొన్నారు.2001లో జి. రఘునందన్ చారి రూ.85వేలకు,.2002లో కందాడ మాధవరెడ్డి రూ.1.05లక్షలకు లడ్డూ పొందారు..2003లో చిగురంత తిరుపతిరెడ్డి రూ.1.55లక్షలకు లడ్డూను దక్కించుకొన్నాడు. 2004 లో కొలను మోహన్ రెడ్డి రూ.2.01లక్షలకు లడ్డూను దక్కించుకొన్నాడు.
2004 లోఇబ్రహీం శేఖర్ రూ.2.08లక్షలకు, 2005లో చిగురంత తిరుపతి రెడ్డి రూ.3 లక్షలకు లడ్డూను దక్కించుకొన్నాడు. 2006లో జి.రఘునందన్ చారి రూ.4.15లక్షలకు దక్కించుకొన్నాడు.2007లో కొలను మోహన్ రెడ్డి రూ. 5.07 లక్షలకు లడ్డూను దక్కించుకొన్నారు.2008లో సరిత రూ.5.10లక్షలకు లడ్డూను దక్కించుకొన్నారు.
2009 లో కొడలి శ్రీధర్ బాబు రూ. 5.35లక్షలకు,.2010లో కొలను బ్రదర్స్ కు రూ. 5.45లక్షలకు లడ్డూను దక్కించుకొన్నారు. 2011లో పన్నాల గోవర్థన్ రూ. 7.50లక్షలు, 2012లో తీగల కృష్ణారెడ్డి రూ.9.26లక్షలకు లడ్డూను పొందారు..2013లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి రూ. 9.50లక్షలను లడ్డును దక్కించుకొన్నారు.
2014లో కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి రూ. 10.32 లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు. 2015లో స్కైలాబ్ రెడ్డి రూ. 14.65లక్షలకు దక్కించుకొన్నారు. 2016లో నాగం తిరుపతి రెడ్డి రూ.15.60 లక్షలకు దక్కించుకొన్నారు. 2017లో శ్రీనివాస్ గుప్తా రూ.16.60లక్షలకు లడ్డూను దక్కించుకొన్నారు.2018లో శ్రీనివాస్ గుప్తా రూ, 16.60 లక్షలకు, 2019లో కొలను రాంరెడ్డి రూ. 17.50 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. ఈ లడ్డూను సీఎం కేసీఆర్ కు అందించారు ఉత్సవ సమితి సభ్యులు.2021లో ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అతని స్నేహితుడు శశాంక్ రెడ్డి రూ. 18.90 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు.
1) కోలన్ మోహన్ రెడ్డి 450/ - 1994.
2 కోలన్ మోహన్ రెడ్డి 4500/ -. 1995.
3)కోలన్ కృష్ణారెడ్డి 18000 /-. 1996.
4)కోలన్ కృష్ణారెడ్డి 28000/- 1997.
5) కోలన్ మోహన్ రెడ్డి 51000/ - 1998.
6) కళ్ళెం ప్రతాప్ రెడ్డి 65000/- 1999.
7) కళ్ళం అంజి రెడ్డి 66000/- 2000.
8)జి. రఘునందన్ చారి 85000/- 2001.
9) కందాడ మాధవరెడ్డి 105000/- 2002.
10) చిగురంత బాల్ రెడ్డి 1,55000/- 2003.
11) కోలన్ మోహన్ రెడ్డి 2,01000 2004.
12) ఇబ్రహీం శేఖర్ 2,08000 2005.
13)చిగురంత తిరుపతి రెడ్డి 300000 2006.
14)G.రఘునందన్ చారి 4,15000/- 2007.
15) కోలన్ మోహన్ రెడ్డి 5,07000/- 2008.
16) సరిత 510000/- 2009.
17) కోడలి శ్రీధర్ బాబు 535000/- 2010.
18) కోలన్ బ్రదర్స్ 545000/- 2011.
19)పన్నాల గోవర్ధన్ 750000/- 2012.
20)తీగల కృష్ణ రెడ్డి 926000/- 2013.
21) సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 950000/- 2014.
22)కళ్లెం మదన్ మోహన్ రెడ్డి 1032000/- 2015.
23) స్కైల్యాబ్ రెడ్డి 14,65000 /- 2016.
24) నాగం తిరుపతి రెడ్డి 1560000 /- 2017.
25) శ్రీనివాస్ గుప్తా 16.60000 /- 2018
26) కొలను రాంరెడ్డి. 17.50 లక్షలు -2019
27). కరోనా కారణంగా వేలం పాట నిర్వహించలేదు. కానీ ఈ లడ్డూను కేసీఆర్ కుుటుంబానికి అందించారు. 2020
28.) ఏపీ ఎమమెల్సీ రమేష్ యాదవ్, శంక్ రెడడి రూ. 18.90 లక్షలు - 2021
29).వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలు- 2022