హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ కామాంధుడు నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. వివరాుల.. బంజారాహిల్స్‌లో నాలుగేళ్ల చిన్నారి బయట ఆడుకుంటుండగా నిందితుడు ఆమె దగ్గరికి వెళ్లాడు. చాకెట్ల ఆశచూపి తనతో పాటు తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి ఆటోలో చిన్నాపై అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే బాలిక గట్టిగా ఏడవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో బంజారాహిల్స్‌ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలికపై లైంగిక దాడికి యత్నించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.