టీఆర్ఎస్‌పై ఆ పార్టీ బహిషృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ మరోసారి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అని... కొత్త వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ బయల్దేరారన్నారు.
టీఆర్ఎస్‌పై ఆ పార్టీ బహిషృత నేత, ఎమ్మెల్సీ రాములు నాయక్ మరోసారి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అని... కొత్త వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసేందుకు కేసీఆర్ బయల్దేరారన్నారు.
మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని స్పష్టం చేశారు. 20 ఏళ్ల అనుబంధాన్ని 20 నిమిషాల్లో బొంద పెట్టారని రాములు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి షోకాజ్ నోటీసు లేకుండా అహంకారంతో తనను సస్పెండ్ చేశారన్నారు. టీఆర్ఎస్‌కు 105 కాదు కదా.. 25-30 సీట్లకు మించి రావని ఆయన జోస్యం చెప్పారు. తనకు ఏ టికెట్ అవసరం లేదని.. ఏ పార్టీ నుంచి పోటీచేయనన్నారు.. తనకు కావాల్సింది గిరిజన రిజర్వేషన్లని రాములు నాయక్ అన్నారు.
పది ప్రభుత్వాలను చూసిన జైపాల్‌రెడ్డిని విమర్శించే అర్హత టీఆర్ఎస్ నేతలకు లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితిని స్విచాఫ్ చేసేందుకు తనతో చేతులు కలపాలని మందకృష్ణ, ఆర్.కృష్ణయ్యలకు పిలుపునిచ్చారు.
నారాయణఖేడ్‌లో తాను ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని.. భూపాల్‌రెడ్డిని ఇండిపెండెంట్‌గా పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. తాను ఎన్నికల్లో ఓడిపోతే ఉరేసుకుంటానని స్పష్టం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ రాములు నాయక్‌ను టీఆర్ఎస్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
నాలాగే టీఆర్ఎస్‌లో చాలా మంది: ఏడ్చిన రాములు నాయక్
రాములు నాయక్ పై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు
