కేటీఆర్ బచ్చా కాదు అచ్చా మంత్రి.....ఎమ్మెల్సీ రాములు నాయక్
తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఒకరు బచ్చా అంటే కాదు మీరే బచ్చా అంటూ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను ఎమ్మెల్సీ రాములు నాయక్ ఖండించారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఒకరు బచ్చా అంటే కాదు మీరే బచ్చా అంటూ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తాజాగా మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను ఎమ్మెల్సీ రాములు నాయక్ ఖండించారు.
మంత్రి కేటీఆర్ బచ్చా కాదు.. మంత్రిగా అచ్చా అంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీని కౌగిలించుకొని కన్నుకొట్టిన రాహుల్ బచ్చా అంటూ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అమెరికాలో ఉద్యోగం వదిలేసి ఉద్యమంలో చేరిన వ్యక్తి కేటీఆర్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నేతలు జేబులు నింపుకోవటం.. ఆస్తులు సంపాదించడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ వెయ్యి సార్లు తెలంగాణలో పర్యటించినా కాంగ్రెస్ అధికారంలోకి రాదని రాములు నాయక్ జోస్యం చెప్పారు.