రాములు నాయక్‌ ‌పై టీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు

టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ రాములునాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

Ramulu naik suspended from trs


హైదరాబాద్: టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ రాములునాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ నేత రాములునాయక్ ‌ను కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు. నారాయణఖేడ్ టీఆర్ఎస్ టిక్కెట్టును  రాములునాయక్ ఆశించారు. కానీ, ఈ టిక్కెట్టును  ఇప్పటికే  ఫైనల్ చేశారు. 

దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాములు నాయక్  రంగం సిద్దం చేసుకొన్నారు.  సోమవారం నాడు మధ్యాహ్నం రాములు నాయక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాలనే  విషయాన్ని వివరించనున్నారు.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని  రాములు నాయక్‌ను టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు.

                                                             Ramulu naik suspended from trs

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్సీ రాములు నాయక్

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios