హైదరాబాద్: తనపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బిజెపి నేత రఘునందన్ రావు కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యకలాపాలకు ఇక నుంచి దూరంగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహించి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. 

తన నిర్ణయాన్ని రఘునందన్ రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ కు, ఇంచార్జీ కృష్ణదాస్ కు తెలిపారు. ఆ మేరకు ఆయన వారిద్దరికి లేఖలు రాశారు. తనపై ఆరోపణలకు సంబంధించిన కేసులో కోర్టులో ఊరట లభించే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన ఆ లేఖలో తెలిపారు. 

Also Read: అవాస్తవాలు: రాధారమణి ఆరోపణలపై స్పందించిన రఘునందన్ రావు

క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు రఘునందన్ రావు తెలిపారు. తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ రాధారమణి అనే మహిళ రఘునందన్ రావుపై ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో నిజం లేదని యాయన చెప్పారు. తాను ఏ నేరం చేయలేదని, ఆ విధమైన ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలియదని ఆయన ఇంతకు ముందు అన్నారు. 

రఘునందన్ రావు పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మెదక్ జిల్లాకు చెందిన రాధారమణి ఆరోపించారు. ఈ మేరకు ఆమె సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. 2007లో రఘునందన్ రావు తనను ఆయన కార్యాలయానికి పిలిపించుకుని కాఫీలో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. మీడియా ముందు కూడా ఆమె ఆ విషయాలు వెల్లడించారు. 

Also Read: హీరో రవితేజ తమ్ముడికి బ్లూఫిలింస్ సప్లై చేసేది రఘునందనరావే: రాధారమణి

అంతేకాకుండా, రఘునందన్ రావుపై ఆమె మరిన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆడవాళ్లను భయపెట్టి లొంగదీసుకుని వారితో బ్లూ ఫిలింస్ తీసి ప్రముఖులకు పంపిస్తారని కూడా ఆమె ఆరోపించారు. 

Also read: నా భర్తతో కలిసి నన్ను రఘునందన్ ‌రావు రేప్ చేశాడు: రాధారమణి