Asianet News TeluguAsianet News Telugu

అవాస్తవాలు: రాధారమణి ఆరోపణలపై స్పందించిన రఘునందన్ రావు

తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. రాధారమణి చేస్తున్న ఆరోపణలు నూటికి నూరు శాతం నిరాధారమైనవని.. ఇప్పటి వరకు తనకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.

bjp leader raghunandan rao reacts radharamani sexul allegations
Author
Hyderabad, First Published Feb 4, 2020, 5:32 PM IST

తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై బీజేపీ నేత రఘునందన్ రావు స్పందించారు. రాధారమణి చేస్తున్న ఆరోపణలు నూటికి నూరు శాతం నిరాధారమైనవని.. ఇప్పటి వరకు తనకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టం చేశారు.

తాను ఏ నేరం చేయలేదని, ఇలాంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో తెలీదని.. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత ఇస్తానని రఘునందన్ రావు అన్నారు.

కాగా రఘునందన్ తనపై పలుమార్లు లైంగిక దాడికి దిగినట్లుగా మెదక్ జిల్లాకు చెందిన రాధారమణి సోమవారం సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

2007లో రఘునందన్ రావు తనను ఆయన కార్యాలయాలనికి పిలిపించుకుని కాఫీలో మత్తు మందు కలిపి అత్యాచారానికి పాల్పడినట్లు రాధారమణి ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం మరోసారి మీడియా ముందుకు వచ్చిన ఆమె సంచలన ఆరోపణలు చేశారు. 

కేసుల పరిష్కారం కోసం వచ్చే ఆడవారిని రఘునందన్ రావు భయపెట్టి లొంగదీసుకుంటాడని రాధారమణి ఆరోపించారు. అనంతరం వారితో బ్లూ ఫిలింగ్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తాడని చెప్పారు.

హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసేది రఘునందన్ రావేనన్నారు. అతనే దగ్గరుండి పరిచయం చేయించి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావుకు సప్లై చేయించేవాడని రాధ తెలిపారు. బ్లూ ఫిలింస్‌లకు సంబంధించిన యూనిట్ ముంబైలో ఉందని... అక్కడి నుంచి ఇవి సప్లయి అవుతూ ఉంటాయని ఆమె పేర్కొన్నారు.

తాను ఈ బాగోతాన్ని ఆధారాలతో సహా పట్టిస్తే సీసీఎస్ పోలీసులు కేస్ క్లోజ్ చేశారని.. ఎందుకని అడిగితే రఘునందన్ రావు చెప్పారు అందుకే చేశామని చెప్పేవారని రాధారమణి వెల్లడించారు. దీనిపై ఎక్కువ మాట్లాడితే తనను ఎన్‌కౌంటర్ చేస్తానని సీఐ రాజశేఖర్ రెడ్డి పబ్లిక్‌లో ఎన్నోసార్లు బెదిరించారని ఆమె ఆరోపించారు.

తాను ఎక్కడ కేసు పెట్టినా సీఐ రాజశేఖర్ రెడ్డి, రఘునందన్ రావు ఫోన్ చేసి కేసును తీసుకోవద్దని ఫోన్‌ చేసి చెబుతారని రాధా ఆవేదన వ్యక్తం చేశారు. రఘునందన్ రావును అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పబ్బం గడుపుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

అమ్మాయిల జీవితాలను నాశనం చేసి, వ్యాపారాలు చేస్తున్నారని రాధా మండిపడ్డారు. సంవత్సరం పాటు కేసు తీసుకోకుండా తనను ప్రతిరోజూ తిప్పేవారని.. రఘునందన్ రావు వచ్చి తనకు అడ్డుపడేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios