బీజేపీ నేత రఘునందన్ రావు తనను టార్చర్ పెట్టాడని ఆరోపించారు రాధారమణి. మంగళవారం మీడియా ముందుకు వచ్చిన ఆమె మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ బలంతో తన కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ సైతం మార్చేశాడని ఆమె ఆరోపించారు.

రఘునందన్ వల్ల తనకు, తన కుమారుడికి ప్రాణహాని వుందన్నారు. తన భర్తతో కలిసి రఘునందన్ రావు తనను కిడ్నాప్ చేశాడని, అనంతరం ఇద్దరూ కలిసి తనపై సామూహితక అత్యాచారానికి పాల్పడ్డారని రాధారమణి ఆరోపించారు.

కేసులు విత్ డ్రా చేసుకోమని రఘునందన్ తనను బ్లాక్‌మెయిల్ చేశాడని, ఆయన తీరుతో విసిగిపోయి హెచ్ఆర్‌సీని ఆశ్రయించానని రాధారమణి తెలిపారు. హెచ్ఆర్‌సీ సూచనల మేరకే ఆర్సీ పురం పోలీస్ స్టేషన్‌లో కేసు పనెట్టానని ఆమె వెల్లడించారు.

Also Read:కాఫీలో మత్తు మందు కలిపి రేప్ చేశాడు, 12 ఏళ్లుగా...: రఘునందన్ రావుపై మహిళ ఆరోపణ

కేసుల పరిష్కారం కోసం వచ్చే ఆడవారిని రఘునందన్ రావు భయపెట్టి లొంగదీసుకుంటాడని రాధా ఆరోపించారు. అనంతరం వారితో బ్లూ ఫిలింగ్ తీసి రాజకీయ నాయకులకు పంపిస్తూ.. బ్లాక్ మెయిల్ చేస్తాడని చెప్పారు.

హీరో రవితేజ తమ్ముడికి బ్లూ ఫిలింస్ సప్లై చేసేది రఘునందన్ రావేనన్నారు. అతనే దగ్గరుండి పరిచయం చేయించి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావుకు సప్లై చేయించేవాడని రాధ తెలిపారు.

బ్లూ ఫిలింస్‌లకు సంబంధించిన యూనిట్ ముంబైలో ఉందని... అక్కడి నుంచి ఇవి సప్లయి అవుతూ ఉంటాయని ఆమె పేర్కొన్నారు.  తాను ఈ బాగోతాన్ని ఆధారాలతో సహా పట్టిస్తే సీసీఎస్ పోలీసులు కేస్ క్లోజ్ చేశారని.. ఎందుకని అడిగితే రఘునందన్ రావు చెప్పారు అందుకే చేశామని చెప్పేవారని రాధారమణి వెల్లడించారు.

దీనిపై ఎక్కువ మాట్లాడితే తనను ఎన్‌కౌంటర్ చేస్తానని సీఐ రాజశేఖర్ రెడ్డి పబ్లిక్‌లో ఎన్నోసార్లు బెదిరించారని ఆమె ఆరోపించారు. తాను ఎక్కడ కేసు పెట్టినా సీఐ రాజశేఖర్ రెడ్డి, రఘునందన్ రావు ఫోన్ చేసి కేసును తీసుకోవద్దని ఫోన్‌ చేసి చెబుతారని రాధా ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:నాపై లైంగిక దాడి: బీజేపీ నేత రఘునందన్‌రావుపై మహిళ ఫిర్యాదు

రఘునందన్ రావును అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు పబ్బం గడుపుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేసి, వ్యాపారాలు చేస్తున్నారని రాధా మండిపడ్డారు.

సంవత్సరం పాటు కేసు తీసుకోకుండా తనను ప్రతిరోజూ తిప్పేవారని.. రఘునందన్ రావు వచ్చి తనకు అడ్డుపడేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు గతంలోనే పెళ్లయ్యిందని.. కానీ రఘునందన్ రావు చెప్పిన విధంగా పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి ట్రాప్ చేసి వివాహం చేసుకున్నాడని రాధా పేర్కొన్నారు.