నగరంలో కలకలం రేపిన చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్

First Published 18, Jul 2018, 3:13 PM IST
rachakonda police says.. they arrest cheddi gang
Highlights

ఆ మధ్యకాలంలో నగరంలోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు అర్ధరాత్రి దొంగతనాలు చేయడం.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడులు చేస్తూ హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ నగరంలో గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతూ.. నగరవాసులను వణికించిన చెడ్డీ గ్యాంగ్ ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. ఆ మధ్యకాలంలో నగరంలోకి ప్రవేశించిన చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు అర్ధరాత్రి దొంగతనాలు చేయడం.. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడులు చేస్తూ హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మాటుమాసి.. పక్కా ప్లాన్‌ ప్రకారం గుజరాత్‌లోని దామోద్‌లో ముగ్గురు చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల్లో అరెస్టు చేసిన చెడ్డీ గ్యాంగ్‌తో పోలీసులు నగరానికి తీసుకురానున్నారు. చెడ్డీ గ్యాంగ్‌ దోచుకున్న సొత్తును ప్రస్తుతం పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఈ గ్యాంగ్‌లో మరికొంతమంది సభ్యులు పరారీలో ఉన్నారు.

loader