పెన్షన్ డబ్బుల్లో నుంచి మద్యం తాగేందుకు రూ.100 ఇవ్వాలని ఓ కుమారుడు వృద్ధ తండ్రిని కోరాడు. తండ్రి దానికి అంగీకరించలేదు. దీంతో క్షణికావేశంలో కుమారుడు తన తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన నల్గొండలో చోటు చేసుకుంది.
అతడో రోజువారి కూలి. కొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. 90 ఏళ్ల తండ్రితో కలిసి ఉంటున్నాడు. అయితే తండ్రికి వచ్చే పెన్షన్ డబ్బుల్లో నుంచి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని ఇటీవల కోరాడు. ఇవ్వకపోవడంతో గొడవకు దిగాడు. మళ్లీ శుక్రవారం కూడా అలాగే గొడవ పడి, రూ.100 కోసం క్షణికావేశంలో తండ్రిని హతమార్చాడు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.
కొత్త కారు కొన్నందుకు స్నేహితులకు పార్టీ.. తిరిగి వస్తుండగా ప్రమాదం.. ముగ్గురి మృతి.. అనంతపురంలో ఘటన
వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా చింతపల్లి మండలానికి చెందిన మల్లయ్య (90)కు ముగ్గురు కుమారులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు. అతడికి ప్రభుత్వం ఆసరా పెన్షన్ ఇస్తోంది. భార్య కొన్నేళ్ల కిందట చనిపోయింది. పిల్లలందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. మల్లయ్య కుమారుడు బుగ్గయ్య కొంత కాలం నుంచి మద్యానికి బానిస అయ్యాడు. దీంతో భార్య కూడా అతడిని వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు తండ్రితో కలిసే ఉంటున్నాడు.
బిల్డింగ్ పై నుంచి దూకి దంపతుల ఆత్మహత్య.. నోయిడాలో ఘటన
అయితే ఇటీవల తాగేందుకు డబ్బులు ఇవ్వాలని బుగ్గయ్య తన తండ్రి మల్లయ్యను కోరాడు. ఈ విషయంలో తండ్రితో గొడవకు దిగాడు. మళ్లీ శుక్రవారం కూడా అలాగే వచ్చి గొడవ పడ్డాడు. పెన్షన్ డబ్బుల్లో నుంచి రూ.100 ఇవ్వాలని తండ్రిని అడిగాడు. డబ్బులు ఇవ్వబోనని తండ్రి తేల్చి చెప్పాడు. దీంతో బుగ్గయ్యకు కోపం వచ్చింది. క్షణికావేశంలో మల్లయ్య తలపై కర్రతో కొట్టాడు. దీంతో వృద్ధుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే చనిపోయాడు.
గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులకు మరోసారి అసెంబ్లీలో ఆమోదం.. రాత్రి 10.20 వరకు సమావేశం
దీనిపై సమాచారం రావడంతో డీఎస్పీ గిరిబాబుతో పాటు ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
