ఏపీలోని అనంతపురంలో కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

కొత్త కారు కొనుగోలు చేసినందుకు ఓ వ్యక్తి తన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీ ముగిసిన అనంతరం తమ గమ్యస్థానానికి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జరిగింది. 

MP Rahul Gandhi: 24 గంటల్లో ఎంపీగా రద్దు చేశారు.. పునరుద్ధరించడానికి ఎంత సమయం?: కాంగ్రెస్

అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం పరిధిలోని రావివెంకటపల్లెలో శనివారం తెల్లవారుజామున ఓ కారు ఘోర ప్రమాదానికి గురైందని ‘ఈనాడు’ వెల్లడించింది. ఈ కారులో మొత్తం నలుగురు ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరొకరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.

Rahul Gandhi: చట్టం దృష్టిలో రాహుల్ గాంధీ ఇంకా దోషే.. : సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యే న్యాయవాది

కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా.. ఈ నలుగురిలో ఒకరు కొత్తగా కారు కొనుగోలు చేశారు. దీంతో తన స్నేహితులకు పార్టీ ఇవ్వాలని భావించారు. ఓ ప్రాంతంలో పార్టీ చేసుకొని తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో రావివెంకటపల్లె సమీపంలో ప్రమాదానికి గురైంది. 

Punganur: చిందిన నెత్తురుపై ఒట్టేసి చెబుతున్నా! పెద్దిరెడ్డి..: నారా లోకేశ్ వార్నింగ్

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.