రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూల వేతనంపై 7.5 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలనే పీఆర్సీ ప్రతిపాదన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని  పీఆర్టీయూ నేతలు అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూల వేతనంపై 7.5 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలనే పీఆర్సీ ప్రతిపాదన ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని పీఆర్టీయూ నేతలు అభిప్రాయపడ్డారు.

సీఎస్ తో పీఆర్టీయూ నేతలు గురువారం నాడు తెలంగాణ సచివాలయంలో సమావేశమయ్యారు. పీఆర్సీ కమిటీ ప్రతిపాదించిన 7. 5 శాతం ఫిట్ మెంట్ పై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. 45 శాతంతో వేతన సవరణ ప్రకటించాలని పీఆర్టీయూ నేతలు డిమాండ్ చేశారు.

also read:పీఆర్సీ నివేదిక ఉద్యోగులకు వ్యతిరేకమే: టీఎన్జీఓ అధ్యక్షుడు రాజేందర్

కేంద్రం తరహాలో పిల్లల చదువుల కోసం నెలకు రూ. 2500 ఇవ్వాలని హెచ్ఆర్‌ఏ పాత స్లాబులు కొనసాగించాలని నేతలు కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పంద ఉపాధ్యాయులు లేకుండా నియామకాలు చేపట్టాలన్నారు.

ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్టుగా ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.