Asianet News TeluguAsianet News Telugu

గొర్రెకుంట డెత్ మిస్టరీలో పురోగతి: ఆరుగురు బీహారీల విచారణ

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తేలిన 9 మంది మృతదేహాల మిస్టరీని ఛేదించడంలో పోలీసులు పురోగతి సాధించారు. ఆరుగురు బీహారీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Progress in Geesugonda dead bodies mystery case: Bihari youth statements recorded
Author
Warangal, First Published May 23, 2020, 2:03 PM IST

వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తేలిన 9 మంది మృతదేహాల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆరుగురు బీహారీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వారి వాంగ్మూలం కేసులో కీలకం అవుతుందని అంటున్నారు. 

మరణానికి ముందు మక్సూద్ బీహారీ యువకులతో ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. వారితో మక్సూద్ ఏం మాట్లాడారనే విషయాన్ని బట్టి కేసు దర్యాప్తు మరింత ముందుకు సాగుతుందని భావిస్తున్నారు. ఎసీపీ, డిసీపీలు మరోసారి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఫోరెన్సిక్ డాక్టర్ ను వారు తమ వెంట తీసుకుని వెళ్లి సంఘటనా స్థలాన్ని పరీశిలించారు. ఫోరెన్సిక్ నిపుణుడి నుంచి ఏసీపీ, డీసీపీ తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటున్నారు.

Also Read: బతికుండగానే బావిలో.. గొర్రెకుంట మృతుల పోస్టుమార్టం రిపోర్ట్

మక్సూద్ కాల్ డేటా ఆధారంగా అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. సంజయ్ కుమార్, మోహన్ లతో వారు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేస్తున్నారు. మక్సూద్ ఇంటిని పోలీసులు మరోసారి పరిశీలిస్తున్నారు. మక్సూద్ ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. కేసును త్వరలోనే ఛేదిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Progress in Geesugonda dead bodies mystery case: Bihari youth statements recorded

గొర్రెకుంటలోని పాడుపడిన బావిలో 9 శవాలు బయటపడిన విషయం తెలిసిందే. మృతి చెందినవారిలో మక్సూద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, మిత్రుడు షకీల్, ఇద్దరు బీహారీ యువకులు ఉన్నారు. 

కేసు మిస్టరీని ఛేదించడానికి బుస్రా ప్రియుడు యాకుబ్ ఫోన్ తో పాటు మక్సూద్ మిత్రుడు షకీల్ ఫోన్ కీలకమని పోలీసులు భావిస్తున్న విషయం తెలిసిందే. మక్సూద్ కూతురు బుస్రాతో సంబంధం పెట్టుకున్నాడని భావిస్తున్న యాకూబ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

అయితే, షకీల్ కూడా మిగతావారితో పాటు మరణించాడు. ఈ నెల 20వ తేదీ రాత్రి 7.30 గంటలకు షకీల్ తన భార్య తాహెరా బేగంతో మాట్లాడాడు. మక్సూద్ అన్న రమ్మంటే వచ్చానని, రాత్రి 10 గంటల వరకు వస్తానని చెప్పాడు. ఆ తర్వాత అతను మళ్లీ మాట్లాడలేదు. శుక్రవారం తేలిన ఐదు శవాల్లో షకీల్ శవం కూడా ఉంది. దీంతో ఆయన  సెల్ నెంబర్లు 6281425573, 9875434986 కాల్ డేటా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: బుస్రా ప్రియుడు యాకూబ్ ఫోన్ కీలకం: ఆ తర్వాత షకీల్ నో రిప్లై

అదే విధంగా బుస్రా ప్రియుడు మిద్దెపాక యాకూబ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఫోన్ నెంబర్ 9951488705 కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బీహార్ కు చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి సంజయ్ కుమార్ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతను కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఆయన నెంబర్ 7644836969 నుంచి మృతులకు పలుమార్లు ఫోన్లు వచ్చినట్లు తేలింది. దీంతో అతన్ని విచారిస్తున్నారు. 

Progress in Geesugonda dead bodies mystery case: Bihari youth statements recorded

మృతి చెందిన 9 మందిలో ఏడుగురి సెల్ ఫోన్ల జాడ తెలియడం లేదు. మృతుల వివరాలు వెల్లడించే సమయంలో ఫోన్ నెంబర్లను కూడా తెలిపారు. మృతులను వెలికి తీసే సమయంలో బావిలో ఎంతగా గాలించినా ఆ ఫోన్లు దొరకలేదు. మక్సూద్ ఆలం, ఆయన భార్య నిషా, కూతురు బుస్రా, కుమారులు షాబాజ్ ఆలం, సోహెల్ ఆలం, బీహారుకు చెందిన శ్రీరాంకుమార్ షా, శ్యాంకుమార్ షా సెల్ ఫోన్లు లభించలేదు. 

ఈ నెల 20వ తేదీ రాత్రి 8 గంటల వరకు షకీల్ ఫోన్ పనిచేయగా, మిగతావాళ్ల ఫోన్ నెంబర్లు పనిచేయలేదు. దీంతో వారి సెల్ ఫోన్లు కీలకంగా మారాయి. మక్సూద్ కూతురు బుస్రా సెల్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత రాత్రి శవాలకు పోస్టుమార్టం జరిగింది. వారంతా సజీవంగానే బావిలో మునిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే మరణించారని సమాచారం. దీంతో వారికి విషం కలిపిన ఆహారం, కూల్ డ్రింక్ లు ఇచ్చి స్పృహ తప్పిన తర్వాత బావిలో పడేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మూడేళ్ల బాలుడి శరీరంపై తప్ప మిగతా వారందరి శవాలపై బావిలో పడినప్పుడు గీరుకుపోయిన గుర్తులు ఉన్నాయి. 

మృతదేహాల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ నివేదిక వస్తే వారి మరణాలకు కారణం తెలిసే అవకాశం ఉంది. బుస్రా ఫోన్ నెంబర్ ఆధారంగా పరిశీలించడంతో దాని నుంచి యాకూబ్ కు కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. దీంతో యాకూబ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం తాను సాయిదత్తా ట్రేడర్స్ కు వెళ్లినట్లు అందరూ బాగానే ఉన్నట్లు యాకూబ్ పోలీసులు చెప్పినట్లు సమాచారం. 

లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో ఇంత కాలం గొర్రెకుంటలో ఉంటున్న మక్సూద్ తిరిగి కరీమాబాదులోని పాత నివాసానికి ఈ నెల 25వ తేదీన వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కరీమాబాదులో అద్దెకు ఉంటున్న నివాసం యజమానికి ఆ విషయం చెప్పడంతో పాటు ఇంటిని శుభ్రం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన కూతురు బుస్రా విషయంలో బీహార్ యువకులు శ్రీరాం, శ్యాంలు ఘర్షణకు దిగడంతో ఆయన సాధ్యమైనంత త్వరగా మకాం మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు సాగిస్తున్నారు ఘటన జరిగిన స్థలానికి సమీపంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో పరిశీలిస్తూ ఫుటేజీలను సేకరిస్తున్నారు. ట్రేడర్స్ కు సమీపంలనే కాకుండా కరీమాబాద్ లో మక్సూద్ ఇంటి సమీపంలోని వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరు బీహారీల గదులను, మక్సూదు నివాసం ఉండే గదులను పరిశీలించి, వేలి ముద్రలు సేకరించారు. వండిన భోజనం తినకుండా ప్లేట్లలో వదిలేసిన అన్నం, ఆకుకూర పప్పు శాంపిల్స్ కూడా తీసుకున్నారు. 

సాయిదత్తా ట్రేడర్స్ కు సమీపంలోని పాత బావిలో నీటిని మోటార్ల సాయంతో తోడేశారు. దాదాపు 60 అడుగుల లోతు ఉన్న బావిలో ఉన్న నీటిని మొత్తం డీఆర్ఎప్ సిబ్బంది తోడేశారు. అయితే, బావిలో సెల్ ఫోన్లు గానీ ఇతర వస్తువులు గానీ లభించలేదు. దీంతో మరణాల మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios