Asianet News TeluguAsianet News Telugu

బుస్రా ప్రియుడు యాకూబ్ ఫోన్ కీలకం: ఆ తర్వాత షకీల్ నో రిప్లై

వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని గొర్రెకుంట బావిలో తేలిన 9 మంది శవాల మిస్టరీని ఛేదించడానికి బుస్రా మిత్రుడు యాకూబ్ ఫోన్ కాల్ డేటా కీలకమని పోలీసులు భావిస్తున్నారు.

Geesugonda dead bodies mystery: Busra friend Yakoob questioned
Author
Warangal, First Published May 23, 2020, 10:46 AM IST

వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో తేలిన శవాల మిస్టరీని ఛేదించడానికి బుస్రా ప్రియుడు యాకుబ్ ఫోన్ తో పాటు మక్సూద్ మిత్రుడు షకీల్ ఫోన్ కీలకమని పోలీసులు భావిస్తున్నారు. మక్సూద్ కూతురు బుస్రాతో సంబంధం పెట్టుకున్నాడని భావిస్తున్న యాకూబ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

అయితే, షకీల్ కూడా మిగతావారితో పాటు మరణించాడు. ఈ నెల 20వ తేదీ రాత్రి 7.30 గంటలకు షకీల్ తన భార్య తాహెరా బేగంతో మాట్లాడాడు. మక్సూద్ అన్న రమ్మంటే వచ్చానని, రాత్రి 10 గంటల వరకు వస్తానని చెప్పాడు. ఆ తర్వాత అతను మళ్లీ మాట్లాడలేదు. శుక్రవారం తేలిన ఐదు శవాల్లో షకీల్ శవం కూడా ఉంది. దీంతో ఆయన  సెల్ నెంబర్లు 6281425573, 9875434986 కాల్ డేటా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. 

అదే విధంగా బుస్రా ప్రియుడు మిద్దెపాక యాకూబ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఫోన్ నెంబర్ 9951488705 కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బీహార్ కు చెందిన దర్భంగా జిల్లా కేవిట్ తాలూకా సిసోనా వాసి సంజయ్ కుమార్ యాదవ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇతను కూడా ఇక్కడే పనిచేస్తున్నాడు. ఆయన నెంబర్ 7644836969 నుంచి మృతులకు పలుమార్లు ఫోన్లు వచ్చినట్లు తేలింది. దీంతో అతన్ని విచారిస్తున్నారు. 

Geesugonda dead bodies mystery: Busra friend Yakoob questioned

మృతి చెందిన 9 మందిలో ఏడుగురి సెల్ ఫోన్ల జాడ తెలియడం లేదు. మృతుల వివరాలు వెల్లడించే సమయంలో ఫోన్ నెంబర్లను కూడా తెలిపారు. మృతులను వెలికి తీసే సమయంలో బావిలో ఎంతగా గాలించినా ఆ ఫోన్లు దొరకలేదు. మక్సూద్ ఆలం, ఆయన భార్య నిషా, కూతురు బుస్రా, కుమారులు షాబాజ్ ఆలం, సోహెల్ ఆలం, బీహారుకు చెందిన శ్రీరాంకుమార్ షా, శ్యాంకుమార్ షా సెల్ ఫోన్లు లభించలేదు. 

ఈ నెల 20వ తేదీ రాత్రి 8 గంటల వరకు షకీల్ ఫోన్ పనిచేయగా, మిగతావాళ్ల ఫోన్ నెంబర్లు పనిచేయలేదు. దీంతో వారి సెల్ ఫోన్లు కీలకంగా మారాయి. మక్సూద్ కూతురు బుస్రా సెల్ కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గత రాత్రి శవాలకు పోస్టుమార్టం జరిగింది. వారంతా సజీవంగానే బావిలో మునిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే మరణించారని సమాచారం. దీంతో వారికి విషం కలిపిన ఆహారం, కూల్ డ్రింక్ లు ఇచ్చి స్పృహ తప్పిన తర్వాత బావిలో పడేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మూడేళ్ల బాలుడి శరీరంపై తప్ప మిగతా వారందరి శవాలపై బావిలో పడినప్పుడు గీరుకుపోయిన గుర్తులు ఉన్నాయి. 

Also Read: బావిలో మృతదేహాల మిస్టరీ: ఓ వ్యక్తితో బుస్రా అఫైర్, ప్రియుడిపై ఆరా

మృతదేహాల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ నివేదిక వస్తే వారి మరణాలకు కారణం తెలిసే అవకాశం ఉంది. బుస్రా ఫోన్ నెంబర్ ఆధారంగా పరిశీలించడంతో దాని నుంచి యాకూబ్ కు కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. దీంతో యాకూబ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం తాను సాయిదత్తా ట్రేడర్స్ కు వెళ్లినట్లు అందరూ బాగానే ఉన్నట్లు యాకూబ్ పోలీసులు చెప్పినట్లు సమాచారం. 

లాక్ డౌన్ ఆంక్షలు సడలించడంతో ఇంత కాలం గొర్రెకుంటలో ఉంటున్న మక్సూద్ తిరిగి కరీమాబాదులోని పాత నివాసానికి ఈ నెల 25వ తేదీన వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు కరీమాబాదులో అద్దెకు ఉంటున్న నివాసం యజమానికి ఆ విషయం చెప్పడంతో పాటు ఇంటిని శుభ్రం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన కూతురు బుస్రా విషయంలో బీహార్ యువకులు శ్రీరాం, శ్యాంలు ఘర్షణకు దిగడంతో ఆయన సాధ్యమైనంత త్వరగా మకాం మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: గీసుకొండ బావిలో 9 శవాల మిస్టరీ: అక్రమ సంబంధమే కారణమా?

Geesugonda dead bodies mystery: Busra friend Yakoob questioned

పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయి దర్యాప్తు సాగిస్తున్నారు ఘటన జరిగిన స్థలానికి సమీపంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో పరిశీలిస్తూ ఫుటేజీలను సేకరిస్తున్నారు. ట్రేడర్స్ కు సమీపంలనే కాకుండా కరీమాబాద్ లో మక్సూద్ ఇంటి సమీపంలోని వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరు బీహారీల గదులను, మక్సూదు నివాసం ఉండే గదులను పరిశీలించి, వేలి ముద్రలు సేకరించారు. వండిన భోజనం తినకుండా ప్లేట్లలో వదిలేసిన అన్నం, ఆకుకూర పప్పు శాంపిల్స్ కూడా తీసుకున్నారు. 

సాయిదత్తా ట్రేడర్స్ కు సమీపంలోని పాత బావిలో నీటిని మోటార్ల సాయంతో తోడేశారు. దాదాపు 60 అడుగుల లోతు ఉన్న బావిలో ఉన్న నీటిని మొత్తం డీఆర్ఎప్ సిబ్బంది తోడేశారు. అయితే, బావిలో సెల్ ఫోన్లు గానీ ఇతర వస్తువులు గానీ లభించలేదు. దీంతో మరణాల మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios