Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంకను కాపాడలేకపోయినందుకు విచారిస్తున్నాం: సీపీ సజ్జనార్

ప్రియాంకరెడ్డి 100కి డయల్ చేసి ఉంటే ప్రాణాలతో బయటపడేదని అభిప్రాయపడ్డారు. ప్రియాంక రెడ్డిని కాపాడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై వెంటనే సమాచారం అందలేదని స్పష్టం చేశారు. 
 

Priyankareddy Murder: Cyberabad CP Sajjanar reacts on Priyankareddy murder case
Author
Hyderabad, First Published Nov 29, 2019, 5:29 PM IST

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నిరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసుల ఎక్కడా ఉదాసీనతగా వ్యవహరించలేదని చెప్పుకొచ్చారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. అర్థరాత్రి 12.30గంటలకు ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారని స్పష్టం చేశారు. 

ఫిర్యాదు అందిన వెంటనే ఘటనా స్థలానికి ఎస్సై వెళ్లారని చెప్పుకొచ్చారు. సీరియస్ గా కేసు విచారణ జరుగుతుందని తెలిపారు. ఇకపోతే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితుల్లో ఎవరూ మైనర్ లు లేరని స్పష్టం చేశారు. తెల్లవారు జామున 3.30గంటలకే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. 

ప్రియాంకరెడ్డి హత్యపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి: లాయర్లు సాయం చేయోద్దు, ఉరిశిక్షే శాస్తి

ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీపీ సజ్జనార్ ఘటన చాలా బాధాకరమన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. కేసు విచారణ వేగవంతంగా జరుగుతుందని స్పష్టం చేశారు. పోలీసులు ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యహరించారని తెలిస్తే చర్చలు తీసుకుంటామని తెలిపారు. 

ప్రియాంకరెడ్డి 100కి డయల్ చేసి ఉంటే ప్రాణాలతో బయటపడేదని అభిప్రాయపడ్డారు. ప్రియాంక రెడ్డిని కాపాడలేకపోయినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఘటనపై వెంటనే సమాచారం అందలేదని స్పష్టం చేశారు. 

అయితే సమాచారం రాగానే టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేసినట్లు స్పష్టం చేశారు. కేసును చేధించేందుకు మొత్తం 10 టీమ్స్ రంగంలోకి దిగాయని తెలిపారు. ప్రియాంక మృతదేహం కాలిపోవడంతో కొన్ని ఆధారాలు మిస్సయ్యాయని, క్లూస్ సంపాదించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని సజ్జనార్ తెలిపారు. 

రక్తమోడుతున్నా కరుణించని మృగాలు: ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు వీళ్ళే...

కీలక ఆధారాలు ఇప్పటికే లభించాయని కేసు పురోగతిలో కాస్త ఆలస్యం జరిగిందని తెలిపారు. వీలైనంత త్వరలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతామని తెలిపారు. వీలైనంత త్వరలో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇకపోతే ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైదరాబాద్ నగరంలో మహిళలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. 6 నుంచి 8నిమిషాల్లో మీరు ఉన్న చోటకి పోలీస్ వాహనం వస్తుందని స్పష్టం చేశారు. అలాగే రాత్రి పూట పోలీస్ పెట్రోల్ కూడా తిరుగుతుందని స్పష్టం చేశారు సైబరాబాద్ సీపీ సజ్జనార్.

Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి
 

Follow Us:
Download App:
  • android
  • ios