రక్తమోడుతున్నా కరుణించని మృగాలు: ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు వీళ్ళే..
లారీ డ్రైవర్ గా పని చేస్తున్న ముహ్మద్ పాషా, జోలు శివ, జోలు నవీన్, చెన్నకేశవులుగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే లారీ డ్రైవర్ మహ్మద్ పాషా మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
హైదరాబాద్: వెటర్నిరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అంతా 35 ఏళ్ల లోపు ఉన్నవారేనని తెలుస్తోంది.ఈ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లారీ డ్రైవర్ గా పని చేస్తున్న ముహ్మద్ పాషా, జోలు శివ, జోలు నవీన్, చెన్నకేశవులుగా పోలీసులు గుర్తించారు. ఇకపోతే లారీ డ్రైవర్ మహ్మద్ పాషా మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మిగిలిన ముగ్గురు నిందితులు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
జోలు నవీన్, జోలు శివలు అన్నదమ్ముల కుమారులు అని తెలుస్తోంది. చెన్నకేశవులు కూడా స్థానికుడేనని పోలీసులు విచారణలో నిర్ధారించారు. నిందితులు నలుగురు కూడా 35 ఏళ్లలోపు వారే కావడం విశేషం.
ఈ నలుగురు నిందితులలో ముహ్మద్ పాషా కాస్త పెద్దవాడని తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు అంటే జోలు శివ, జోలు నవీన్, చింతకుంట చెన్నకేశవులు ముగ్గురూ కూడా 30 ఏళ్లలోపు వారేనని పోలీసులు నిర్ధారించారు.
ఈ నలుగురు నిందితులు ప్రియాంకరెడ్డిని అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేశారని తెలుస్తోంది. ముహ్మద్ పాషా నడిపిస్తున్న లారీని అడ్డంపెట్టుకుని తీవ్రంగా దాడి చేశారని సమాచారం.
నలుగురు యువకులే కావడంతో వారు తీవ్రంగా దాడి చేయడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రియాంక చేరుకుందని పోలీసుల విచారణలో తేలింది. బోరున విలపిస్తున్న ఆ మానవ మృగాల మనసు కరగలేదు.
దాడి చేసిన తర్వాత కూడా ఆమెను అక్కడ ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోని ఓ గదిలో తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేద్దామని ప్రయత్నించారు. అయితే ఆ గదికి తాళం వేసి ఉండటంతో కిటికీలోంచి లోపలికి ప్రియాంకరెడ్డిని తోసి అత్యాచారం చేద్దామని ప్రయత్నించారు.
కిటీకీలు అద్ధాలు పగలుగొట్టినప్పటికీ అది సాధ్యంకాకపోవడంతో ప్రియాంకను లోపలికి తోద్దామని కూడా ప్రయత్నించారు. అప్పటికే ప్రియాంక దెబ్బలతో రక్తమోడుతున్నట్లు అక్కడ పరిస్థితిని చూస్తే తెలుస్తోంది.
అయినా మానవమృగాల్లో ఏమాత్రం చలనం రాలేదు. లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో ఆరుబయటే గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నలుగురు అత్యాచారం చేసి ఆమెను అక్కడే చంపేశారు.
అత్యాచారం చేసిన అనంతరం ఆమెను అత్యంత దారుణంగా హతమార్చారని తెలుస్తోంది. పోలీసులకు ఎలాంటి సాక్షాలు దొరక్కుండా ఉండేందుకు ఆమెను చంపి ఆ మృతదేహాన్నిలారీలో వేసుకుని వేరే ప్రాంతంలో పడేసి తగులబెట్టారు.
ఆ తర్వాత పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు చటాన్ పల్లిబ్రిడ్జ్ కిందకు తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగులబెట్టినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం.
అయితే పోలీసులకు అటువైపు వెళ్తున్న పాలవ్యాపారి మంటలను గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు మహిళ మృతదేహంగా గుర్తించారు.
అయితే ఈ ఘటనలో నిందితులు ప్రొఫెషనల్ కిల్లర్స్ గా వ్యవహరించారని తెలుస్తోంది. ఒక చోట హత్య చేసి ఎవరికీ అంతుపట్టకుండా మృతదేహాన్ని చటాన్ పల్లి బ్రిడ్జ్ కింద లారీలో తీసుకువచ్చి మరీ దహనం చేశారు.
అంతేకాదు ప్రియాంకరెడ్డి స్కూటీని ఘటనా స్థలం నుంచి 10 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి విడిచిపెట్టడం చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Priyanka Reddy: మృగాల చేతుల్లో నరకయాతన, కిటికీ అద్ధాలు ధ్వంసం చేసి