Asianet News TeluguAsianet News Telugu

ప్రియాంకరెడ్డి హత్యపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి: లాయర్లు సాయం చేయోద్దు, ఉరిశిక్షే శాస్తి

ప్రియాంకరెడ్డి హత్య యావత్ దేశాన్నే కదిలించి వేసిందన్నారు కిషన్ రెడ్డి. ప్రియాంకరెడ్డిపై అత్యంతదారుణంగా ప్రవర్తించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకరెడ్డి హత్యను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. 
 

Union minister Kishanreddy reacts on doctor priyankareddy murder
Author
Hyderabad, First Published Nov 29, 2019, 4:52 PM IST

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నిరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యపై కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రియాంకరెడ్డి హత్య చాలా బాధాకరమన్నారు. 

ప్రియాంకరెడ్డి హత్య యావత్ దేశాన్నే కదిలించి వేసిందన్నారు కిషన్ రెడ్డి. ప్రియాంకరెడ్డిపై అత్యంతదారుణంగా ప్రవర్తించి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రియాంకరెడ్డి హత్యను ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. 

నిందితులకు నిర్భయ చట్టం కింద ఉరిశిక్ష పడాలని తాను కోరుకుంటున్నట్లు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే నిందితుల తరపున వాదించేందుకు ఏ న్యాయవాది ముందుకు రావొద్దని సూచించారు. ఇలాంటి నిందితులకు ఏ న్యాయవాది సాయం చేయకూడదని సూచించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.   

రక్తమోడుతున్నా కరుణించని మృగాలు: ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు వీళ్ళే

ఇకపోతే ఈనెల 27న డ్యూటీకి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన ప్రియాంక తిరిగి ఇంటికి రాలేదు. మధ్యలో తన సోదరికి ఫోన్ చేసి స్కూటీ పంక్చర్ అయ్యిందని తనకు భయంగగా ఉందని చెప్పిన  కొద్ది సేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. 

దాంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కుటుంభ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం తెల్లవారు జామున షాద్ నగర్ సమీపంలో శవమై తేలడంతో కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

మరోవైపు ఈ హత్యకేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కావాలనే ప్రియాంకరెడ్డి స్కూటీ పంక్చర్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

లారీల మధ్య ప్రియాంకరెడ్డిని రేప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేశారని విచారణలో తేలింది. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పటించారు. మరికాసేపట్లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios