ప్రియాంకరెడ్డి హత్యకేసుపై కిషన్ రెడ్డి రిక్వస్ట్: బార్ అసోషియేషన్ కీలక నిర్ణయం
ప్రియాంకరెడ్డి దారుణ ఘటన ఒక హేయమైన చర్య అని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సహాయ నిరాకరణే సరైన నిర్ణయమని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
రంగారెడ్డి: వైద్యురాలు ప్రియాంకరెడ్డి దారుణ హత్య ఘటనకు సంబంధించి రంగారెడ్డి జిల్లా బార్ అసోషియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. నిందితుల తరపున వాదించకూడదని తీర్మానించింది. శనివారం జిల్లా బార్ అసోసియేషన్ సమావేశం అయ్యింది.
ఈ సమావేశంలో నిందితుల తరపున ఎట్టి పరిస్థితుల్లో వాదించకూడదని ఏకగ్రీవ తీర్మాణం చేసింది బార్ అసోషియేషన్. అంతే కాకుండా నిందితులకు ఉరిశిక్ష పడేంత వరకు న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుంది.
జిల్లా బార్ అసోషియేషన్ నిర్ణయాన్ని గౌరవించి ఇతర న్యాయవాదులు కూడా నిందితులకు ఎలాంటి సహాయం అందించకూడదని విజ్ఞప్తి చేశారు. ప్రియాంకరెడ్డి దారుణ ఘటన ఒక హేయమైన చర్య అని అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సహాయ నిరాకరణే సరైన నిర్ణయమని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
వాళ్లకి ఉరిశిక్ష పడాలి... ఏ లాయర్ వాదించొద్దు: ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి
ఇకపోతే శుక్రవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సైతం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులకు ఉరిశిక్షే సరైనదని అభిప్రాయపడ్డారు. నిందితులకు లాయర్లు సహాయ నిరాకరణ చేయాలని కోరారు.
నిందితుల తరపున ఎలాంటి వాదనలు వినిపించకూడదని రిక్వస్ట్ చేశారు. ప్రియాంకరెడ్డిపై జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఉరిశిక్షే సరైనదని కిషన్ రెడ్డి అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.
ప్రియాంకరెడ్డి హత్యపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి: లాయర్లు సాయం చేయోద్దు, ఉరిశిక్షే శాస్తి
ఇకపోతే బుధవారం సాయంత్రం ప్రియాంకరెడ్డిని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర ప్రియాంకరెడ్డి స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు.
కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి ప్రియాంక తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.
అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి తగుటబెట్టారు.
ఇకపోతే హత్య కేసులో డ్రైవర్ ఏ1మహ్మద్ పాషా, ఏ2 క్లీనర్ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్ (23), ఏ4 క్లీనర్ చెన్న కేశవులు (లారీ డ్రైవర్)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్ తెలిపారు. నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.