వాళ్లకి ఉరిశిక్ష పడాలి... ఏ లాయర్ వాదించొద్దు: ప్రియాంక తండ్రి శ్రీధర్ రెడ్డి
తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి. ఓ ఆడిపిల్ల తల్లీగా నిందితుల తరపున ఏ న్యాయవాదీ వాదించొద్దని అభ్యర్ధిస్తున్నాని ఆయన వాపోయారు.
తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన నిందితులకు ఉరిశిక్ష విధించాలన్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి తండ్రి శ్రీధర్ రెడ్డి. ఓ ఆడిపిల్ల తల్లీగా నిందితుల తరపున ఏ న్యాయవాదీ వాదించొద్దని అభ్యర్ధిస్తున్నాని ఆయన వాపోయారు.
సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన లేకే తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని.. మరో ఆడపిల్లకు ఇలా జరగకుండా పోలీసులు అవగాహన కల్పించాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read:ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన
నిందితులకు ఉరిశిక్ష వేస్తేనే న్యాయం జరిగినట్లని... ఫాస్ట్ ట్రాక్ కోర్టు కేసును త్వరగా పూర్తి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారికి ఉరిశిక్ష పడితినే తన బిడ్డ ఆత్మ శాంతిస్తుందని శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ప్రియాంక రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన... ఈ కేసును మహబూబ్‌నగర్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, వృద్ధులు, యువతులు అత్యసవర సమయాల్లో 100కు డయల్ చేయాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
ప్రియాంక మిస్సింగ్ కేసుపై తక్షణమే స్పందించామని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రియాంక 27 సాయంత్రం 5.50కి శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్లిందని.. 28వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు ప్రియాంక మిస్సింగ్‌పై ఫిర్యాదు అందిందని సజ్జనార్ తెలిపారు.
27 రాత్రి 9.22కి స్కూటీ పంక్చర్ అయినట్లు ప్రియాంక సోదరికి కాల్ చేసిందని ఆయన వెల్లడించారు. శంషాబాద్ టోల్‌ప్లాజా దగ్గర ప్రియాంక స్కూటీ పంక్చర్ అయ్యిందని.. నలుగురు నిందితులు మద్యం సేవిస్తూ ప్రియాంక గురించి మాట్లాడుకున్నారని సీపీ పేర్కొన్నారు.
Also Read:ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్
నలుగురు నిందితుల్లో నవీన్ స్కూటీ వెనుక టైరులో గాలిని తీసేశాడని.. ప్రధాన నిందితుడు మహ్మద్ పాషా పంక్చర్ వేయిస్తామని ప్రియాంకను నమ్మించాడని ఆయన తెలిపారు. అనంతరం క్లీనర్ శివను పంపి బండిని రిపేర్ చేయించాల్సిందిగా పంపాడన్నారు. బుధవారం రాత్రి 11.30కి ఆమెను హత్య చేశారని.. నోరు నొక్కి ఊపిరాడకుండా చేయడం వల్లే ప్రియాంక మరణించిందని సజ్జనార్ వెల్లడించారు.