హైదరాబాద్: వెటర్నీరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసులో నిందితులను మరికాసేపట్లో కోర్టుముందుకు ప్రవేశపెపెట్టనున్నారు సైబరాబాద్ పోలీసులు. ప్రియాంకరెడ్డిపై అత్యాచారం హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

శుక్రవారం సాయంత్రం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. అయితే శనివారం షాద్ నగర్ కోర్టులో నిందితులను ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.  

పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను మరికాసేపట్లో వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను షాద్ నగర్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. 

రక్తమోడుతున్నా కరుణించని మృగాలు: ప్రియాంకపై దారుణానికి ఒడిగట్టిన ఆ నలుగురు వీళ్ళే....

కేసులో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రియాంకరెడ్డి అత్యాచారం, హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులు నలుగురు ఆమెను అత్యంత దారుణంగా కిరోసిన్ పోసి తగులబెట్టిన సంగతి తెలిసిందే. 

ఈ పరిణామాల నేపథ్యంలో మరిన్ని ఆధారాలు సేకరించాల్సిన పరిస్థితి నెలకొంది. నిందితులను సీన్ ఆఫ్ ఎఫెన్స్ కింద ఘటనా స్థలానికి వెళ్లి రీ కనస్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. దాంతో నిందితులను కస్టడీకి కోరాలని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. 

  ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

ఇకపోతే బుధవారం సాయంత్రం ప్రియాంకరెడ్డిని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర ప్రియాంకరెడ్డి స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి ప్రియాంక తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి తగుటబెట్టారు. 

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ పాషా, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు. నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.