హైదరాబాద్: వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచారకమిటీ చైర్ పర్సన్, సినీనటి విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియాంకరెడ్డి మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇది భాగ్యనగరానికి గర్భశోకమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మదమెక్కిన మగ పిశాచుల దాష్టీకానికి మాతృహృదయం ఛిద్రమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన ప్రియాంకకే కాదని సభ్య సమాజానికి ఒక కళంకమన్నారు. 

విధి నిర్వహణకు వెళ్లిన వైద్యురాలు విధి వంచితురాలైపోయింది అంటూ ఆమె తన బాధను వ్యక్తం చేశారు. కామాంధుల కర్కశంతో కన్నుమూసిందంటూ విచారం వ్యక్తం చేశారు.హైటెక్ పరిసరాల్లో, హై సెక్యూరిటీ జోన్లో జరిగిన ఘోరం, హాహాకారాలు పెట్టినా పట్టించుకోని వైనం అంటూ తల్లడిల్లిపోయారు విజయశాంతి. తెలంగాణ సభ్య సమాజానికి తీరని అవమానంగా ఆమె అభిప్రాయపడ్డారు.

 

వరంగల్‌లో మానస పట్ల మృగాళ్ల కిరాతకం అనంతరం ఆరు నెలల చిన్నారిపై కూడా ఆగని అరాచకం తాజాగా ప్రియాంకరెడ్డిపై దారుణం ఇలా అన్ని ఘటనలలో సమిధలు అవుతున్నది కేవలం ప్రియాంక, మానసలే కాదని గొప్పగా చెప్పుకొనే మానవత్వం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గాంధేయ మార్గం అని చెప్పుకునే దేశం ఔనత్యం కూడా అన్నారు.

ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన  

ఇప్పటికైనా ప్రభుత్వం నిద్ర మేలుకోపోతే మహిళా ఉద్యమం తథ్యమన్నారు. తెలంగాణలో మహిళలపై జరిగే దారుణాలను చూశాక ప్రశ్నలకు దొరకని సమాధానాలు ఎన్నో ఉన్నాయన్నారు. షీ టీంలు కంటితుడుపేనా? మహిళా భద్రత ఎండమావేనా? అంతా ముగిశాక పర్యవేక్షణా? విశ్వనగరంలో అతివకేదీ రక్షణ? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిఘటన సినిమాలో దుర్యోధన దుశ్యాసన దుర్వినీతి లోకంలో పాటను నేటికీ గుర్తుచేసుకునే పరిస్థితి నెలకొనడం విచారకరమన్నారు. మృగాళ్ల వికృత పోకడలతో మహిళలకు తప్పని దుస్థితి అంటూ విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  

కిరాతకులపై ఉక్కుపాదం మోపాలి అని డిమాండ్ చేసిన విజయశాంతి అర్ధరాత్రి సైతం అతివలు స్వేచ్ఛగా తిరిగే రోజులు రావాలన్నారు. 1979 నుంచి నేటి వరకు నలభై సంవత్సరాలుగా ప్రజలు అభిమానించిన మనిషిగా ఒక మహిళగా తన ఆవేదనను అర్థం చేసుకోవాలని విజయశాంతి స్పష్టం చేశారు. 

ఇకపోతే బుధవారం సాయంత్రం ప్రియాంకరెడ్డిని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర ప్రియాంకరెడ్డి స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

Priyanka Reddy case: నా కొడుకును చంపేయండి.. నిందితుడి తల్లి అభ్యర్ధన

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి ప్రియాంక తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి తగుటబెట్టారు. 

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ పాషా, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు.

priyanka reddy case : షాద్ నగర్ పీఎస్ లో నిందితులు.. చంపేస్తామంటూ