priyanka reddy case : షాద్ నగర్ పీఎస్ లో నిందితులు.. చంపేస్తామంటూ...

పోలీస్ స్టేషన్లో నిందితులు ఉండటంతో స్టేషన్లోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఇరువురి మధ్య స్వల్పతోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన కారులు నిరసనకు దిగారు. 

Priyanka murder case: accuses in shad nagar police station, tension situation at ps

హైదరాబాద్: వైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్య కేసు తెలంగాణలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రియాంకరెడ్డిపై దారుణ హత్యకు పాల్పడిన నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలియడంతో ప్రజలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చారు. 

పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులను ఎన్ కౌంటర్ చేస్తారా లేకపోతే వదిలేస్తారా అంటూ ఆందోళన కారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను వదిలెయ్యాలంటూ ఆందోళన కారులు డిమాండ్ చేస్తున్నారు. 

పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. షాద్ నగర్ కోర్టుకు నిందితులను తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి ఆందోళన కారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 

పోలీస్ స్టేషన్లో నిందితులు ఉండటంతో స్టేషన్లోకి చొచ్చుకుని పోయేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో ఇరువురి మధ్య స్వల్పతోపులాట జరిగింది. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళన కారులు నిరసనకు దిగారు. 

ష్టేషన్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు స్టేషన్ చుట్టూ మోహరించారు. అలాగే షాద్ నగర్ పీఎస్ నుంచి కోర్టు వరకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. 

ఇకపోతే బుధవారం సాయంత్రం ప్రియాంకరెడ్డిని నలుగురు నిందితులు అత్యంత దారుణంగా రేప్ చేసి హత్య చేశారు. తొడుపల్లి దగ్గర ప్రియాంకరెడ్డి స్కూటీ పార్క్ చేయడం చూసిన లారీ డ్రైవర్ మహ్మాద్ పాషా ఉద్దేశపూర్వకంగా ఆమె స్కూటీ పంక్చర్ అయ్యిందని కుట్ర పన్నారు. 

కేసులో ఏ3గా ఉన్న జొల్లు నవీన్ స్కూటీ బ్యాక్ టైర్ లో గాలి తీసేశారు. గచ్చిబౌలి నుంచి ప్రియాంక తొండుపల్లి వద్దకు రాగానే బ్యాక్ టైర్ పంక్చర్ అయ్యిందని నమ్మించారు. పంక్చర్ వేయిస్తామని చెప్పగానే ఆమె స్కూటీ ఇచ్చేసింది. పంక్చర్ వేయిస్తామని తీసుకెళ్లిన వారు గాలి కొట్టించి తిరిగి ఇచ్చేశారు.

అనంతరం ఆమెను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అత్యాచార సమయంలో యువతి కేకలు వేయడంతో నోరు మూయడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు నిర్థారించారు. అనంతరం చటాన్ పల్లి బ్రిడ్జ్ దగ్గర కిరోసిన్ పోసి నిప్పంటించి తగుటబెట్టారు. 

ఇకపోతే హత్య కేసులో డ్రైవర్‌ ఏ1మహ్మద్ పాషా, ఏ2 క్లీనర్‌ జొల్లు శివ (20), ఏ3 జొల్లు నవీన్‌ (23), ఏ4 క్లీనర్‌ చెన్న కేశవులు (లారీ డ్రైవర్‌)ను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ మీడియాకు స్పష్టటం చేశారు. తెలిపారు. వైద్యురాలి హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్‌ తెలిపారు. నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios