Asianet News TeluguAsianet News Telugu

ప్రైవేట్ స్కూల్ బ‌స్సు ఢీ.. ఇద్ద‌రు చిన్నారులు మృతి.. ఇబ్ర‌హీంప‌ట్నంలో ఘ‌ట‌న

ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీ కొనడంతో ఇద్దరు చిన్నారుల పిల్లలు చనిపోయారు. ఆ చిన్నారులు బీహార్ వలస కార్మికుల కుటుంబాలకు చెందినవారు. ఇబ్రహీంపట్నంలో ఈ ఘటన జరిగింది. 

Private school bus collided.. Two children died.. Incident in Ibrahimpatnam
Author
First Published Sep 14, 2022, 1:10 PM IST

హైద‌రాబాద్ లో ని ఇబ్రహీంపట్నం వ‌ద్ద రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బ‌స్సు ఢీకొన‌డంతో ఇద్దరు గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. బాధితులు బీహార్ నుండి వలస వచ్చిన కార్మికుల పిల్లలు. వారిద్ద‌రు స్కూల్ ల‌కు వెళ్తుండ‌గా మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న జ‌రిగింది. బస్సు డ్రైవర్ నిర్ల‌క్ష్య‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణం అని పోలీసులు కేసు న‌మోదు చేశారు.

పటాన్‌చెరులో చిట్టీల పేరుతో ఘరానా మోసం.. డబ్బులతో ఉడాయించిన మహిళ.. న్యాయం చేయాలని కలెక్టరేట్‌కు బాధితులు

ఇబ్రహీంపట్నంలోని శేరిగూడ సమీపంలోని కవిత రైస్ మిల్ స‌మీపంలో ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో ఒక‌రు 13 ఏళ్ల బాలిక కాగా.. మ‌రొక‌రు ఆమె ఎనిమిదేళ్ల మేనల్లుడు. వారిద్ద‌రు కవిత రైస్ మిల్లులో ఉపాధి పొందుతున్న వలస కార్మికుల పిల్లలు. ఆ బాలిక తల్లిదంల్లిడ్రులు మిల్లులో పనిచేస్తుండగా, అబ్బాయి తల్లిదండ్రులు బీహార్ లో ఉన్నార‌ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదించింది. 

సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం: ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన తమిళిసై

బాధితులిద్దరూ శేరిగూడలోని గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుంటున్నారు. ఆ స్కూల్ రైస్ మిల్ నుంచి కిలోమీటరు లోపు దూరంలో ఉంటుంది. వారు ప్ర‌తీ రోజు న‌డుచుకుంటూ వెళ్లి వ‌చ్చేవారు.రోజు మాదిరిగానే మంగ‌ళ‌వారం కూడా స్కూల్ కు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఓ ప్రైవేట్ స్కూల్ బ‌స్సు యూట‌ర్న్ తీసుకుంటోంది. అయితే ఆ బ‌స్సు డ్రైవ‌ర్  ఈ ఇద్ద‌రు పిల్ల‌ల‌ను గుర్తించ‌లేదు. దీంతో వారిపైకి బ‌స్సు దూసుకెళ్లింది. ఆ పిల్ల‌ల‌కు తీవ్రగాయాలు కావ‌డంతో పోలీసులు హాస్పిటల్ త‌ర‌లించారు. 

స్పీకర్ చర్యలు తీసుకొంటే న్యాయపరంగా వెళ్తాం: వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల

బాధితులను హాస్పిట‌ల్ కు తీసుకువెళ్లిన వెంట‌నే బాలిక మృతి చెందింద‌ని డాక్ట‌ర్లు నిర్ధారించారు. అయితే బాలుడు ప్రాణాల‌తోనే ఉన్నాడు. కానీ చికిత్స పొందుతున్న స‌మ‌యంలో ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించాడు. కాగా.. ఈ ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే బ‌స్సు డ్రైవ‌ర్ భాష‌య్య ఘ‌ట‌నా స్థ‌లం నుంచి పారిపోయాడు. బాధితురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు నిందితుడిపై ఐపీసీ సెక్ష‌న్ సెక్షన్ 304-ఏ (అనుకోకుండా లేదా నిర్లక్ష్యర్ల పు చర్య కారణంగా మరణానికి కారణం) కింద కేసు నమోదు చేశామ‌ని ఇబ్రహీంపట్నం ఇన్స్ పెక్ట‌ర్ ఆర్ సైదులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న‌ట్టు చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రైవేట్ స్కూల్ ఆర్థిక సాయం అందించింద‌ని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios