వరంగల్ జిల్లా పరకాల జైలు నుంచి ఓ ఖైదీ పారిపోయిన ఘటన కలకలం రేపింది. ఆ ఖైదీని పోలీసులు కేవలం 4 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు.  

పరకాల : పరకాల సబ్‌ జైలు నుంచి సోమవారం ఉదయం పరారైన అండర్‌ ట్రయల్‌ ఖైదీ మహమ్మద్‌ పాషాను పోలీసులు నాలుగు గంటలు వెతికిన తరువాత పట్టుకున్నారు. జైలు ప్రాంగణం వెలుపల చెత్తను శుభ్రపరిచే పని అప్పగించిన క్రమంలో దోషి తప్పించుకున్నట్లు భావిస్తున్నారు. సహ ఖైదీలు జైలర్ ఎన్ ప్రభాకర్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో జైలర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించి హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

పాషాను మార్చి 18న ఏటూరునాగారం పోలీస్ స్టేషన్‌లో లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసి సబ్ జైలుకు పంపినట్లు రెడ్డి తెలిపారు. అతనిపై పరకాల పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. పరకాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) పి కిషన్‌ మాట్లాడుతూ పాషాను పరకాల పట్టణంలో పట్టుకుని జైలు అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

బీజేపీలో ఎంతో మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్‌ రకాలు ఉన్నట్టు కనిపిస్తోంది.. కేటీఆర్ సంచలన ట్వీట్..

ఎలా పట్టుబడ్డాడు అంటే… జైలు నుంచి తప్పించుకున్న తర్వాత చెట్ల పొదల్లో ఆదమరిచి నిద్రపోయాడు. ఆ తర్వాత అలికిడికి ఉలిక్కిపడి లేచి చూసేసరికి పోలీసులు చుట్టుముట్టారు. వారి నుంచి మళ్లీ తప్పించుకోబోయే చివరికి పట్టుబడక తప్పలేదు. పరకాల జైలు నుంచి పరాడైన రిమాండ్ ఖైదీని పట్టించడంలో అతని భార్య ఇచ్చిన సమాచారం బాగా ఉపయోగపడింది. ఆ ఖైదీ పేరు షేక్ గౌస్ పాషా అలియాస్ చోటు (22). 2019లో మహాదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామానికి చెందిన అతడిని రిమాండ్ ఖైదీగా కరీంనగర్ జైలులో ఉంచారు.

ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చాడు. అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఈ యేడు మార్చి 18న పోలీసులు అతడిని అరెస్టు చేసి పరకాల సబ్ జైలుకు తరలించారు. పరకాల సబ్ జైలుకు వచ్చినప్పటి నుంచి జైలు సిబ్బందితో సన్నిహితంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున 6.20ని.లకు మున్సిపల్ వాహనంలో చెత్త వేయడానికి జైలు గేటు దాటి బయటికి వచ్చాడు. అదే అదనుగా అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఈ విషయం అధికారులకు తెలియడంతో వెంటనే అతడిని పట్టుకునే విషయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జైలు నుంచి పరారైన వ్యక్తి ముందుగా భార్యకు ఫోన్ చేస్తాడని అనుమానంతో.. భార్యకి ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు తనంతట తాను జైలుకు తిరిగి వస్తే శిక్ష తక్కువ పడుతుందని.. లేకపోతే ముందు ఉన్న శిక్షతోపాటు మరింత కాలం జైల్లో ఉండాల్సి వస్తుందని చెప్పారు. పోలీసులు ఊహించినట్టుగానే గౌస్ పాషా భార్యకు ఫోన్ చేశాడు. 

ముందుగానే పోలీసులు హెచ్చరించడంతో భార్య ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు ఆ నెంబర్ను ట్రేస్ చేసి.. లొకేషన్ ఆధారంగా అయ్యప్ప గుడి దగ్గరికి చేరుకున్నారు. గుడి చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు, కాలువలు, చెట్లపొదలలో వెతికారు. చివరికి ఓ దగ్గర ఆదమరచి నిద్రపోతున్న పాషాను గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు.