తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మున్నాభాయ్, ఎంబీబీఎస్ రకాలు ఉన్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీలో చాలా మున్నాభాయ్, ఎంబీబీఎస్ రకాలు ఉన్నట్లు కనిపిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీలు కూడా నకిలీ సర్టిఫికేట్ కలిగి ఉన్నారని ఆరోపించారు. రాజస్థాన్, తమిళనాడు విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికేట్లు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఎన్నికల అఫిడవిట్‌లో అబద్దాలు చెప్పడం క్రిమినల్ నేరం కాదా అని ప్రశ్నించారు. లోక్ సభ స్పీకర్ దీనిని నిర్దారించకూడదా? దోషులుగా తేలితే అనర్హత వేటు వేయచ్చు కదా? అని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
ఇదిలా ఉంటే.. డిగ్రీ సరిఫ్టికేట్ల విషయంలో ప్రధాని మోదీ టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతలు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ‘నా స్టడీ సర్టిఫికెట్లు చూపిస్తా’ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ చేశారు. తాను పుణె యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో బిజినెస్‌లో మాస్టర్ డిగ్రీ చేసినట్టు పేర్కొన్నారు.
మరోవైపు బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. భారతదేశంలో నిజమైన డిగ్రీలు ఉన్నవారికి ఉద్యోగం రాదని.. డిగ్రీలు లేనివారికి ఉన్నత ఉద్యోగం ఉందని కామెంట్ చేశారు.
