Asianet News TeluguAsianet News Telugu

PM Modi : దొంగ‌లు పోవాల‌నుకుంటే గ‌జ దొంగ‌లు వ‌చ్చారు.. ప్ర‌ధాని మోడీ

Lok Sabha Elections 2024 - PM Modi : లోక్‌సభ ఎన్నికలు 2024 నేప‌థ్యంలో ప్రధాని న‌రేంద్ర మోడీ తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాగ‌ర్ క‌ర్నూల్ లో జ‌రిగిన స‌భ‌లో మోడీ మాట్లాడుతూ.. దొంగ‌లు పోవాల‌నుకుంటే గ‌జ దొంగ‌లు వ‌చ్చారంటూ వ్యాఖ్యానించారు. 
 

Prime Minister Modi criticizes BRS and Congress saying that if thieves want to go, yard thieves have come Nagarkurnool RMA
Author
First Published Mar 16, 2024, 12:35 PM IST

General Elections 2024 : ప్రధాని న‌రేంద్ర మోడీ శ‌నివారం తెలంగాణలో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నాగ‌ర్ క‌ర్నూల్ లో బ‌హిరంగ స‌భ‌తో బీజేపీ ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించారు. శ‌నివారం ఉదయం 10.45 గంటలకు రాజ్ భవన్ నుంచి బేగంపేట విమానశ్రయానికి చేరుకున్నారు. అక్క‌డి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూల్ కు వ‌చ్చారు. నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప యాత్ర‌లో ఎన్నిక‌ల ప్ర‌చారం షురూ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల‌ను టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

దేశంలో బీజేపీ గాలి వీస్తోంద‌ని చెప్పిన ప్ర‌ధాని మోడీ.. దేశ ప్ర‌జ‌లంద‌రూ బీజేపీ వైపు చూస్తున్నార‌నీ, మ‌రోసారి బీజేపీ స‌ర్కారు వ‌స్తుంద‌ని అన్నారు. రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో 400 సీట్లు రాబోతున్నాయ‌ని చెప్పారు. మ‌రికొద్ది గంటల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ రాబోతున్న‌ద‌ని చెప్పిన మోడీ.. ఫ‌లితాలు అప్పుడు వ‌చ్చాయ‌నీ, మ‌రోసారి మోడీ స‌ర్కారు వ‌స్తుంద‌న్నారు. తెలంగాణ‌ను గేట్ వే ఆఫ్ సౌత్ అని అంటార‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్దిని అడ్డుకున్నాయ‌ని తెలిపారు.

కావాల‌నే ఇరికించారు.. ఇది అక్ర‌మ అరెస్టు.. రౌస్‌ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

గోయ్యిలోని నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే నుయ్యిలోకి వెళ్లిన‌ట్టు అయింద‌న్నారు. బీఆర్ఎస్ లూటీ నుంచి కాంగ్రెస్ దుష్ట‌శ‌క్తుల చేతుల్లోకి తెలంగాణ‌ వెళ్లింద‌ని మోడీ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌త ప‌దేళ్లుగా తెలంగాణ అభివృద్దికి ఏన్డీయే స‌ర్కారు కృషి చేసింద‌ని తెలిపారు. రాబోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో  తెలంగాణ‌లో మెజారిటీ స్థానాలు గెలిపించాల‌ని కోరారు. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం భారీ అవినీతికి పాల్ప‌డింద‌ని ఆరోపించారు. ఏడు ద‌శాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ చేసిందేమీ లేద‌ని అన్నారు. ఈ స‌మ‌యంలో దేశాన్ని కాంగ్రెస్ లూటీ చేసింద‌ని విమ‌ర్శించారు.

కాంగ్రెస్ పార్టీ పేద‌ల‌ను త‌మ ఓటు బ్యాంకుగానే చూసింద‌ని ఆరోపించారు. గ‌రీబ్ హ‌ఠావో నినాదం ఇచ్చారు కానీ, పేద‌ల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాలేద‌ని ప్ర‌ధాని మోడీ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణ‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ల‌ల‌ను నాశ‌నం చేశాయ‌ని అన్నారు. తాము మాత్రం పేద‌ల‌కు ఎన్నో ప‌థ‌కాలు తీసుకువ‌చ్చామ‌ని అన్నారు. ఈ వేగ‌వంత‌మైన అభివృద్దిని తెలంగాణ‌లో కూడా మ‌నం తీసుకురావాలి అని అన్నారు.

రాజ‌కీయ క‌క్ష‌.. ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోంది.. బీజేపీ పై కేటీఆర్ ఫైర్

 

Follow Us:
Download App:
  • android
  • ios