హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి బంధువులు ప్రవీణ్ రావు, అతని సోదరుల కిడ్నాప్ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితులను బెదిరించి ఫైళ్లపై సంతకాలు చేయించుకునే బాధ్యతను మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ తీసుకోగా, కిడ్నాప్ చేయడానికి అవసరమైన పథకాన్ని ఆమె భర్త భార్గవ్ రామ్, శ్రీనివాస్ చౌదరి అలియాస్ గుటూరు శ్రీను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. 

హైదరాబాదులోని రూ. 2వేల కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకోవడానికి భారీ పథక రచన చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మూడు నెలలుగా ప్రవీణ్ రావు కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రవీణ్ రావు ఇంటి సమీపంలోని దుకాణాలు, టీ స్టాళ్లు, బ్యాంక్, హోటల్ వద్ద కిడ్నాపర్లు నిఘా పెట్టి మంగళవారం రాత్రి పరిస్తితి అనుకూలంగా ఉందని భావించి కిడ్నాప్ చేశారు. 

Also Read: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: లొంగిపోవడానికి సిద్ధమైన భార్గవరామ్

కిడ్నాప్ చేసిన ముగ్గురి పట్ల ఎలా వ్యవహరించాలనే విషయంపై భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కిడ్నాపర్లకు వివరించినట్లు తెలుస్తోంది. గంటలోపు మొయినాబాదులోని ఫామ్ హౌస్ కు తీసుకుని రావాలని, తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్న తర్వాతనే వదిలేయాలని కిడ్నాపర్లకు సూచించినట్లు పోలీసులు గుర్తించారు. 

Also Read: అఖిలప్రియ బెయిల్: ఆరోగ్యంపై లాయర్ల ఆందోళన.. విచారణ సోమవారానికి వాయిదా

కిడ్నాప్ నకు వాడిన మూడు కార్లకు కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ స్టిక్కర్లు అతికించారు. పోలీసు దుస్తులు ధరించనవారు కిటికీల పక్కన కూర్చున్నారు. వాట్సప్ కాల్స్ మాత్రమే చేస్తూ వచ్చారు.