Asianet News TeluguAsianet News Telugu

అఖిలప్రియ బెయిల్: ఆరోగ్యంపై లాయర్ల ఆందోళన.. విచారణ సోమవారానికి వాయిదా

అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. అఖిలప్రియ ఆరోగ్యంపై సికింద్రాబాద్ కోర్టులో మెమో దాఖలు చేశారు. అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని న్యాయవాదులు కోర్టుల దృష్టికి తీసుకొచ్చారు

court postponed hearing on akhila priya bail petition ksp
Author
Hyderabad, First Published Jan 8, 2021, 5:58 PM IST

అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. అఖిలప్రియ ఆరోగ్యంపై సికింద్రాబాద్ కోర్టులో మెమో దాఖలు చేశారు.

అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని న్యాయవాదులు కోర్టుల దృష్టికి తీసుకొచ్చారు. ఈఎన్‌టీ సర్జన్ దగ్గరకు అఖిలప్రియను తరలించాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అఖిలప్రియ ఆరోగ్యంపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌లో పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఆమెకు బెయిల్ వస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం వుందని చెప్పిన పోలీసులు బెయిల్ మంజూరు చేయొద్దని కౌంటర్‌లో తెలిపారు.

Also Read:అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దు: కోర్టులో పోలీసుల కౌంటర్

భూమా అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం ఏ మాత్రం లేదని పోలీసులు వెల్లడించారు. సాక్ష్యాలు సేకరణకు దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి వుందన్నారు. అఖిల ప్రియ సాక్షులను బెదిరించే అవకాశం వుందని వారు అభిప్రాయపడ్డారు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానిక ప్రజల్లో అభద్రతా భావం నెలకొందని పోలీసులు తెలిపారు.

ఆమెకు రాజకీయంగా, ఆర్ధికంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి వుందని కోర్టుకు తెలిపారు. అఖిలప్రియ బెయిల్‌పై వస్తే దర్యాప్తును, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని పోలీసులు వెల్లడించారు. అలాగే ఆమె మరిన్ని నేరాలకు పాల్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.  అఖిలప్రియకు బెయిల్ ఇస్తే విచారణ నుంచి తప్పించుకోవచ్చని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios