Asianet News TeluguAsianet News Telugu

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు: లొంగిపోవడానికి సిద్ధమైన భార్గవరామ్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ లొంగిపోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 

bhargav ram ready to surrender in bowenpally kidnap case ksp
Author
Hyderabad, First Published Jan 8, 2021, 8:24 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏ3 నిందితుడిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్‌ లొంగిపోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డిలతో పాటు.. కిడ్నాప్‌లో పాల్గొన్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ-1గా ఉన్న అఖిలప్రియ బెయిల్‌ కోసం పిటిషన్ దాఖలు చేసినా.. బెయిల్ వచ్చే సానుకూల పరిస్థితులు కనిపించడంలేదు.

మరోవైపు.. పరారీలో ఉన్న భార్గవరామ్ లొంగిపోవడానికి వస్తున్నాడన్న సమాచారంతో సికింద్రాబాద్‌ కోర్టు దగ్గర పోలీసులు అప్రమత్తం అయ్యారు. కోర్టు లోపలకి వచ్చి భార్గవరామ్‌ లొంగిపోతాడాని ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.. భారీకేడ్లు పెట్టి కోర్టు తలుపులు మూసివేశారు.

ఇదే సమయంలో వాయిదాల కోసం వచ్చిన వారిని కోర్టు బయటే ఉంచారు పోలీసులు. దీంతో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ లాయర్లు మండిపడుతున్నారు.

Also Read:అఖిలప్రియ బెయిల్: ఆరోగ్యంపై లాయర్ల ఆందోళన.. విచారణ సోమవారానికి వాయిదా

మరోవైపు ఈ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. అఖిలప్రియ ఆరోగ్యంపై సికింద్రాబాద్ కోర్టులో మెమో దాఖలు చేశారు.

అఖిలప్రియ ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈఎన్‌టీ సర్జన్ దగ్గరకు ఆమెను తరలించాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం అఖిలప్రియ ఆరోగ్యంపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios