Asianet News TeluguAsianet News Telugu

బ్యూటిషియన్ వొంటి మీద గాయాలు: పోస్టుమార్టం నివేదిక

బ్యూటీషియన్ శిరీష పోస్టుమార్టం  రిపోర్టు వెలువడింది. అందులో కీలకమైన, ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. అసలు శిరీష ఆత్మహత్య చేసుకుందా  హత్య చేశారా అన్నది పోస్టు  మార్టం  రిపోర్టులో నిక్షిప్తమైంది. రిపోర్టులో వివరాల ప్రకారం శిరీషది ఆత్మహత్య కాదన్న వాదన వినిపిస్తోంది. 

postmortem reveals injuries on beautician Sireeshas body

 

బ్యూటీషియన్ శిరీష పోస్టుమార్టం  రిపోర్టు వెలువడింది. అందులో కీలకమైన, ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. అసలు శిరీష ఆత్మహత్య చేసుకుందా  హత్య చేశారా అన్నది పోస్టు  మార్టం  రిపోర్టులో నిక్షిప్తమైంది. రిపోర్టులో వివరాల ప్రకారం శిరీషది ఆత్మహత్య కాదన్న వాదన వినిపిస్తోంది. 

 

 

ఇప్పటి వరకు శిరీష ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం సాగింది. ఆమె స్నేహితులుగా ఉన్న వారు కూడా శిరీష ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. అయితే పోలీసులు శిరీష మరణంపై విచారణ వేగవంతం చేశారు. అనుమానితులుగా భావిస్తున్న రాహుల్ ను విచారిస్తున్నారు.

 

 

మరోవైపు డాక్టర్లు శిరీష భౌతిక కాయం పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు అందజేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోస్టు మార్టం  నివేదికలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

 

ఆమె తలకు వెనుక భాగంలో గాయాలున్నాయి.

కుడి కన్ను పై కమిలిన గాయాలున్నాయి.

మెడ నుమిలిన ఆనవాళ్లు ఉన్నాయి.

రెండు పెదవుల పై గాయాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

 

శిరీష శరీరంపై ఈ గాయాలు ఎలా వచ్చాయి అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. ఆత్మహత్య కోసం ఉరి వేసుకుంటే పెదవులపై గాయం ఎలా అవుతుందనేది డౌట్. తల వెనక భాగంలో గాయం ఎలా వస్తుంది అనేది మరో అనుమానం. కేసును విచారిస్తున్న పోలీసులు ప్రధాని నిందితులు రాజీవ్, శ్రవణ్ లను ఫిల్మ్ నగర్ లోని రాజీవ్ స్టూడియో కు తీసుకెళ్లారు. శిరీష అక్కడే ఆత్మహత్య చేసుకుంది. స్టూడియోకు తీసుకెళ్లి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

 

మరోవైపు శిరీష మరణంపై క్లారిటీ వస్తే  కానీ ఎస్సై ప్రభాకర్ రెడ్డి  మరణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నందున శిరీష పోస్టుమార్టం రిపోర్టుపై సర్వత్రా టెన్షన్ వాతావరణం నెలకొంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios