హైదరాబాద్: ఆస్మా బేగం కేసులో కొన్ని సంచలన విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్మా బేగం కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Also read: ఆస్మా వెన్నులో బుల్లెట్: సంచలన విషయాలు

వెన్నుముక నొప్పితో  ఉన్న ఆస్మా బేగం శరీరం నుండి బుల్లెట్ నుండి నిమ్స్  వైద్యులు ఈ నెల 21వ తేదీన బుల్లెట్‌ను వెలికి తీశారు.ఆస్మా బేగం తండ్రి కింగ్స్ పంక్షన్ హాల్ లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కింగ్స్  ఫంక్షన్  హాల్  యజమాని కొడుకు జుబేర్ గతంలో ఓ పెళ్లి బరాత్ సమయంలో కాల్పులు జరిపాడు.

ప్రస్తుతం ఈ కేసు కూడ పోలీసుల దృష్టికి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా ఆస్మా బేగం కుటుంబసభ్యులు ఈ విషయమై ఎందుకు పోలీసులకు చెప్పలేదని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also read:వెన్నునొప్పి ఆపరేషన్ చేస్తే బుల్లెట్ దొరికింది

ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆస్మా బేగం శరీరంలోకి బుల్లెట్ ఎలా వచ్చిందనే విషయమై ఆరా తీస్తున్నారు. జుబేర్ గతంలో పెళ్లి  వేడుకల సందర్భాన్ని పురస్కరించుకొని కాల్పులు జరిపాడు. 

ఆ సమయంలో   ఈ ఘటన పెద్ద సంచలనమే. దీంతో అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.ఆస్మాబేగం కాల్పుల వ్యవహరాం వెలుగు చూడడంతో జుబేర్  కాల్పుల కేసును కూడ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని  పోలీసులు భావిస్తున్నారు.