హైదరాబాద్‌ బొల్లారంలో ఓ పోలీసు సీఐ తప్పతాగి కారు నడిపారు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కూరగాయల లోడ్‌తో  ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు.

హైదరాబాద్‌ బొల్లారంలో ఓ పోలీసు సీఐ తప్పతాగి కారు నడిపారు. ఈ క్రమంలోనే ఎదురుగా వస్తున్న కూరగాయల లోడ్‌తో ఉన్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో కూరగాయల లోడ్‌తో వెళ్తున్న వాహన డ్రైవర్ శ్రీధర్‌కు గాయాలయ్యాయి. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇక, సీఐ శ్రీనివాస్ ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. డీఎస్పీ ప్రమోషన్ లిస్ట్‌లో కూడా ఆయన పేరు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తాజాగా సీఐ తప్పతాగి కారు నడిపిన ఘటన కలకలం రేపింది.

సీఐ మద్యం మత్తులో ఉన్నారని.. ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయమంటే పోలీసులు తొలుత నిరాకరించారని శ్రీధర్ సంబంధికులు పేర్కొన్నారు. దీంతో తాము నిరసనకు దిగామని.. రెండు గంటల తర్వాత సీఐకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తే.. 201 రీడింగ్ వచ్చిందని పేర్కొన్నారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇక, సీఐ శ్రీనివాస్ వాహనంపై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఉన్నాయి. ఇందులో ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్‌కు సంబంధించిన చలాన్లు ఉన్నాయి.